'భగవంత్ కేసరి' నుండి ఫస్ట్ సింగిల్.. ఎప్పుడు రాబోతుందంటే?

నందమూరి నటసింహం బాలకృష్ణ( Balakrishna ) వరుసగా హిట్స్ అందుకుంటూ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.

అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో రెండు హిట్స్ అందుకున్న బాలయ్య ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ పై కన్నేశాడు.

ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి( Anil Ravipudi ) దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న మోస్ట్ ఏవైటెడ్ మూవీ భగవంత్ కేసరి.ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి పాజిటివ్ వైబ్స్ స్టార్ట్ అవ్వగా కొద్దిరోజుల క్రితం భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) టీజర్ రిలీజ్ చేయడంతో మరిన్ని అంచనాలు పెంచేశారు.

ఒక్క టీజర్ తోనే అనిల్ బాలయ్యను ఎంత పవర్ఫుల్ గా చూపించ బోతున్నాడో అర్ధం అయ్యేలా తెలిపాడు.మరి బాలయ్య ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తుండగా అతి త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

దసరా సీజన్ ను( Dasara ) బాలయ్య కబ్జా చేయనున్నాడు.షూటింగ్ లాస్ట్ స్టేజ్ కు చేరుకోగా ప్రమోషన్స్ కోసం సిద్ధం అవుతున్నారు మేకర్స్.ఒక వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తూనే మరో వైపు ప్రమోషన్స్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు.

Advertisement

ఇక తాజాగా ఈ సినిమా నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.ఈ సినిమా నెక్స్ట్ మ్యూజికల్ బ్లాస్ట్ స్టార్ట్ కానున్నట్టు టాక్.

ఈ విషయం కన్ఫర్మ్ అవ్వడంతో భగవంత్ కేసరి నుండి ఫస్ట్ సింగిల్ ను( Bhagavanth Kesari First Single ) అతి త్వరలోనే రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.చూడాలి ఎప్పుడు ఈ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవుతుందో.దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

ఇక బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా కూతురు రోల్ లో శ్రీలీల, విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ నటిస్తున్నారు.ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.

బీట్‌రూట్ ఆకుల‌తో ఇలా చేస్తే.. ఊడిన జుట్టు మ‌ళ్లీ వ‌స్తుంది!
Advertisement

తాజా వార్తలు