'లవ్ స్టోరీ' మళ్ళీ షూటింగ్ జరుపుకుంటుందా ?

టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

శేఖర్ కమ్ముల సినిమాలంటే ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈయన సినిమాలన్నీ హత్తుకునేలా ఉంటాయనడంలో అతిశయోక్తి కాదేమో.ఈ సినిమా సమ్మర్ కానుకగా విడుదల అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది.

అప్పటి నుండి ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ మళ్ళీ ప్రకటించలేదు.అయితే ఈ మధ్యనే కరోనా నుండి కోలుకుని థియేటర్స్ ఓపెన్ అవ్వడం తో మళ్ళీ అన్ని సినిమాలు విడుదలకు సిద్ధం అయ్యాయి.

ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 10 న థియేటర్స్ లో విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేసారు.మళ్ళీ ఏమైందో తెలియదు కానీ ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్టు మళ్ళీ ప్రకటించారు.

మల్లె రీ షూట్ చేయబోతున్నట్టు సమాచారం అందుతుంది.ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు మళ్ళీ తీయడానికి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినట్టు సినీ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement
Latest Interest Buzz On Naga Chaitanya Love Story Movie, Akkineni Naga Chaitanya

రిలీజ్ వాయిదా పడడంతో శేఖర్ కమ్ముల ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఇంకా మంచిగా తీయాలని నిర్ణయించుకుని షూటింగ్ స్టార్ట్ చేసినట్టు టాక్.

కూడా రీ షూట్స్ చేసి కొన్ని సన్నివేశాలను మళ్ళీ తెరకెక్కించిన విషయం తెలిసిందే.ఇంకా మరొక రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది.ఈ సినిమాలో ముద్దు గుమ్మ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.

ఇప్పటికే విడుదల అయినా టీజర్, పోస్టర్స్, పాటలు ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచాయి.

Advertisement
Latest Interest Buzz On Naga Chaitanya Love Story Movie, Akkineni Naga Chaitanya

తాజా వార్తలు

Latest Interest Buzz On Naga Chaitanya Love Story Movie, Akkineni Naga Chaitanya