కథ వినగానే కన్నీళ్లొచ్చాయ్ అంటున్న కొత్త హీరోయిన్!

టాలీవుడ్ లో మొదటిసారి నటనతో అడుగుపెట్టిన ఉప్పెన భామ ఒక్క చూపుతోనే అందరిని తన మాయలో పడేసింది.

తన అందంతో యువత హృదయాలను గెలుచుకున్న ముద్దుగుమ్మ కృతి శెట్టి.

సినిమా విడుదల కాకముందే ఈ అమ్మడుకు ఆఫర్లు బాగా జోరందుకుంటున్నాయి.ఇక ఉప్పెన సినిమా విడుదల తర్వాత ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ హీరోయిన్ లను మించుపోతుందని అర్థమవుతుంది.

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తొలిసారిగా వెండితెరకు ఉప్పెన సినిమాతో పరిచయం కానున్నాడు.ఇక కృతి శెట్టి కూడా ఈ సినిమాతోనే తొలిసారిగా అడుగుపెట్టనుంది.

కృతి శెట్టి మోడలింగ్ లో ఎక్కువ ఆసక్తి చూపించేదట‌.అంతేకాకుండా చిన్న చిన్న ప్రకటనలను కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ.

Advertisement

ఈ విధంగా కృతి శెట్టి నటించిన ఉప్పెన సినిమా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కనుంది.ఇక ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది.

ఈ విధంగా కృతి శెట్టి మంగళవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ.కొన్ని విషయాలు అభిమానులతో పంచుకుంది.

తనకు నటనపై ఆసక్తి ఉన్న సినిమాలను ఎంచుకుంటానని ఏ రోజు అనుకోలేదట.తాను చదువుకుంటున్న సమయంలోనే కొన్ని ప్రకటనలు నటించిందనే విషయాన్ని తెలిపింది.

వాటి ద్వారా ఉప్పెన సినిమాలో నటించే అవకాశం వచ్చింది అంటూ.బుచ్చిబాబు ఈ సినిమా కథ గురించి వినిపించగానే కన్నీళ్లు వచ్చాయని తెలిపింది.

మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్.. దుల్కర్ రూపంలో టాలీవుడ్ కు మరో స్టార్ హీరో దొరికారా?
లక్కీ భాస్కర్ : భిన్నమైన కథే కానీ, అందరి బుర్రకెక్కుతుందో లేదో చూడాలి!

2002 బ్యాక్ డ్రాప్ లో స్వచ్ఛమైన ప్రేమకథతో వెండితెరపై రానున్నదని, తాను ఇందులో బేబమ్మ అనే పాత్రలో నటించిందట.నిజ జీవితంలో తనకు అలాంటి పరిస్థితులు ఎదురైతే ఎలా ఉంటుందో ఊహించుకొని ఆ విధంగా సినిమా పాత్రల్లో నటించిందట.తన లైఫ్ లో కొన్ని అంశాలు ఈ పాత్రకు దగ్గరగా ఉందని తెలిపింది.

Advertisement

అంతేకాకుండా ఈ సినిమాకు సుకుమార్ ఇచ్చిన ధైర్యమే నడిపించింది అంటూ తెలిపింది.ఏ నటులైన సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ వంటి నిపుణులతో చేయాలనుకుంటారు.

కానీ తనకు వీరిద్దరి కాంబినేషన్ లో తొలిసారిగా నటించే అవకాశం అదృష్టం అని తెలిపింది.తాను నటన పట్ల ఎలాంటి శిక్షణ తీసుకోలేదంటూ.

కేవలం దర్శకుడు బుచ్చిబాబు అందించిన సహకారంతోనే ఈ సినిమాను పూర్తి చేశానని తెలిపింది.ప్రస్తుతం నానితో శ్యామ్ సింగ్ రాయ్ సినిమాలో నటిస్తున్నట్లు తెలిపింది.

అంతేకాకుండా సుధీర్ బాబుతో మరో సినిమాలో చేస్తున్నానని తెలిపింది.

తాజా వార్తలు