బాలయ్యకు కొలవెరిడీ సెట్ అయ్యేనా భయ్యా...?

నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) ఈ వయసు లో విజయాలతో హ్యాట్రిక్‌ కొట్టి అందరికి షాక్ ఇచ్చాడు.

ఈ మధ్య కాలంలో సీనియర్‌ హీరోలు మాత్రమే కాకుండా యంగ్‌ హీరో లు కూడా ఒక్క హిట్ కొట్టడానికి చాలా కష్టపడుతున్నాడు.

అలాంటిది బాలయ్య ఈ లేటు వయసు లో ఏకంగా మూడు భారీ విజయాలను సొంతం చేసుకోవడం మామూలు విషయం కాదు.భారీ బ్లాక్ బస్టర్‌ లుగా అఖండ, వీర సింహా రెడ్డి మరియు భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) సినిమా లు నిలిచిన విషయం తెల్సిందే.

ఇప్పుడు బాబీ దర్శకత్వం లో ఒక సినిమా ని బాలయ్య చేయబోతున్నాడు.అఖండ నుంచి మొదలుకుని భగవంత్‌ కేసరి వరకు అన్ని సినిమా లకు కూడా థమన్ వాయించాడు.

ఆయన బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ తో బాలయ్య అభిమానులకు చుక్కలు చూపించాడు.

Advertisement

ఇప్పుడు బాబీ ఆ సంగీత దర్శకుడిని మార్చాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం అందుతోంది.థమన్‌ ప్లేస్ లో తాను బాలయ్య తో రూపొందించబోతున్న సినిమా కు గాను అనిరుధ్‌ ను తీసుకు రావాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం అందుతోంది.ఇది ఎంత వరకు నిజం అనేది క్లారిటీ లేదు.

కానీ అనిరుధ్‌ తో బాలయ్య సినిమాకు వర్క్‌ చేయిస్తే ఎఇలా ఉంటుందో అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు.

మొదట బాలయ్య సినిమాకు వర్క్ చేయాలి అంటే అనిరుధ్‌ రూ.10 కోట్ల ను డిమాండ్‌ చేస్తాడు.ఆ పారితోషికం కు ఒప్పుకున్నా కూడా కనీసం ఆరు నెలల సమయం ఆయనకు ఇవ్వాల్సి ఉంటుంది.

ఎందుకంటే ఆయన చేతిలో డజను సినిమా లు ఉన్నాయి.ఆ సినిమాలన్నీ కూడా లైన్ లో పూర్తి చేసుకుంటూ వస్తాడు.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

చివరకు బాలయ్య సినిమా ను చేస్తాడు.కనుక బాలయ్య సినిమాకు అనిరుద్‌ అవసరమా అన్నట్లుగా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

మరి దర్శకుడు బాబీ నిర్ణయం ఏంటో చూడాలి.

తాజా వార్తలు