గ్రౌండ్లో కోహ్లీ, రోహిత్‌ల‌ను అలా చూసి మురిసిపోతున్న ఫ్యాన్స్‌..

టీమ్ ఇండియా అన‌గానే ఇప్పుడు అంద‌రికీ ముందుగా గుర్తుకు వ‌చ్చేది కోహ్లీ, రోహిత్‌లు.వీరిద్ద‌రూ త‌మ ఆట‌తో ఎప్పుడూ ఫేవ‌రెట్ గానే నిల‌బ‌డ్డారు.

ఇలా వారి ఆట‌తో ఎంద‌రినో అల‌రించిన వారు.ఈ న‌డుమ వరుస‌గా వార్త‌ల్లో నిలిచిన విష‌యం తెలిసిందే.

కెప్టెన్సీ విష‌యంలో ఇద్ద‌రూ అంద‌రి దృష్టిలో ప‌డ్డారు.కెప్టెన్ కోహ్లీని తొల‌గించి రోహిత్‌కు ప‌గ్గాలు ఇవ్వ‌డం పెను సంచ‌ల‌న‌మే రేపింది.

ఇద్ద‌రి మ‌ధ్య వార్ ఉంద‌ని అంతా అనుకున్నారు.ఒకరి కెప్టెన్సీలో ఆడ‌టానికి మ‌రొక‌రు ఇంట్రెస్ట్ చూప‌ట్లేద‌నే వార్త‌లు అనేకం వ‌చ్చాయి.

Advertisement
Kohli And Rohit Fans On The Ground., Kohli, Rohith, Sports News , Sports Upadate

దీంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా ఇరువురి ఫ్యాన్స్ పెద్ద వారే న‌డిపారు.కోహ్లీని తొల‌గించ‌డంపై ఆయ‌న అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

అయినా స‌రే బీసీసీఐ మాత్రం వారిని క‌ల‌ప‌డానికి ట్రై చేసింది.ఇక ఇద్ద‌రినీ ఒప్పించి రోహిత్‌కు వ‌న్డే, టీ20 ప‌గ్గాలు అప్ప‌గించింది.

అయితే ఇద్ద‌రి న‌డుమ ఇక స‌యోధ్య కుద‌ర‌ద‌ని అంతా అనుకున్నారు.కానీ ఇప్పుడు మైదానంలో ఇద్ద‌రూ క‌లిసి బాగానే ఆడుతున్నారు.

ఇక మొద‌టి సారి రోహిత్ కెప్టెన్సీలో కోహ్లీ ఆడుతున్నాడు.వెస్ట్ ఇండీస్ తో జ‌రుగుతున్న వ‌న్డే సిరీస్ లో కోహ్లీ, రోహిత్ గ్రౌండ్ లో క‌న‌ప‌డ్డారు.

Kohli And Rohit Fans On The Ground., Kohli, Rohith, Sports News , Sports Upadate
అక్కినేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరో రాలేడా..?
నాగార్జున విషయంలో ఎందుకిలా జరుగుతుంది...

అయితే ఇద్ద‌రూ క‌లిసి బాగానే మాట్లాడుకోవ‌డం, రోహిత్‌కు కోహ్లీ స‌ల‌హాలు ఇవ్వ‌డం లాంటి కెమెరాల్లో చిక్కాయి.ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ ఆకట్టుకోవడం ఇక్క‌డ గ‌మ‌నార్హం.ఇక వీరిద్ద‌రూ మాట్లాడుకుంటున్న ఫొటోల‌ను ఇరువురి అభిమానులు నెట్టింట్లో తెగ వైర‌ల్ చేస్తున్నారు.

Advertisement

ఇలాగే ఎప్పుడూ క‌లిసి ఉండాలంటూ అంద‌రూ కామెంట్లు పెడుతున్నారు.ఇక మ‌రికొంద‌రు మాత్రం రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడ‌టం కోహ్లీకి ఎప్ప‌టికైనా ఇబ్బందే అంటూ చెప్పుకొస్తున్నారు.

అయినా వీరిద్ద‌రూ క‌లిసి జ‌ట్టును మ‌రింత బ‌లంగా త‌యారు చేయాల‌ని అంతా అంటున్నారు.

తాజా వార్తలు