యంగ్ సెన్సేషన్ కిరణ్ అబ్బవరం హీరోగా కోడి రామకృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా తన ప్రొడక్షన్ నెం 1 గా కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో చేస్తున్న సినిమా నేను మీకు బాగా కావాల్సినవాడిని.
కొత్త దర్శకుడు కార్తిక్ శంకర్ ని ఈ సినిమాతో పరిచయం చేస్తున్నారు.
రాజావారి రాణిగారు, ఎస్ ఆర్ కళ్యాణమండపం లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం ఇందులో కొత్తగా కనిపిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ అద్బుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు.ఈ ఆడియోని లహరి ద్వారా మార్కెట్ లోకి తీసుకు వస్తున్నారు.
ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా వస్తోంది.ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది.
మరికొన్ని రోజుల్లో చిత్ర షూటింగ్ పూర్తి కానున్న ట్లు తెలిపారు దర్శక నిర్మాతలు.కిరణ్ అబ్బవరం మాస్ లుక్ లో అందర్ని ఆకట్టుకుంటున్నాడు.
ఈ సినిమాకి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy