సింపుల్ గా పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. పెళ్లి ఎప్పుడు ఎక్కడంటే?

చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలు ఇటీవల కాలంలో పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.

అయితే ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న వారిలో నటుడు కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) ఒకరు.

ఈయన రాజా వారు రాణి వారు అనే సినిమా ద్వారా హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తున్నారు.

ఈ సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు రహస్య గోరఖ్( Rahasya Gorakh ) .ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడటం ఆపరిచయం కాస్త ప్రేమగా మారడంతో వీరిద్దరూ కలిసి పెద్దల సమక్షంలో పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నారు.ఇటీవల నిశ్చితార్థం( Engagment ) జరుపుకున్నటువంటి ఈ జంట ఆగస్టు నెలలోనే పెళ్లి చేసుకోబోతున్నారని ఇప్పటికే పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయని రహస్య సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

తాజాగా వీరి పెళ్లి ( Marriage ) తేదీ పెళ్లి ఎక్కడ జరగబోతుంది అనే విషయాలు కూడా వెల్లడించారు రహస్య కర్ణాటకకు చెందిన అమ్మాయి కావడంతో వీరి బంధువులందరూ అక్కడే ఉన్న నేపథ్యంలో వీరి పెళ్లిని కూడా కర్ణాటకలోని కూర్గ్ ( Coorg ) వద్ద కేవలం అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా సింపుల్ గా జరగబోతుందని తెలుస్తుంది.ఈ పెళ్లి వేడుకలలో కుటుంబ సభ్యులు సన్నిహితులు మాత్రమే పాల్గొనబోతున్నారు మరి ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ఈ పెళ్లికి హాజరవుతున్నారా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది.

Advertisement
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

తాజా వార్తలు