ఖమ్మంజిల్లా: గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

ఒడిస్సా రాష్ట్రం నుంచి ఖమ్మం కి 11 కేజీలు గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఏన్కూరు మండల పోలీసులు పట్టుకున్నారు.

ఎస్సై సాయి కుమార్ ఆధ్వర్యంలో స్థానిక జన్నారం క్రాస్ రోడ్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అనుమానంగా కనిపించారు.

వారిని అదుపులోకి తీసుకుని చెకింగ్ చేయగా వారి వద్ద 11 కేజీలు గంజాయి సుమారు 55 వేల రూపాయల గల గంజాయిని,ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని వారిరువురు పై ఎస్సై సాయి కుమార్ కేసు నమోదు చేయడం జరిగింది.ఈ తనిఖీల్లో పోలీస్ సిబ్బంది భరత్,శంకర్ పాల్గొన్నారు.

8 ఏళ్ల వయసులో శవం తో కొన్ని గంటలు బంధింపబడ్డ హీరో ఇతనే..!

Latest Khammam News