ఏపీ ఫైబర్ నెట్ కేసులో కీలక పరిణామం..!

ఏపీ ఫైబర్ నెట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.సుప్రీంకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు పిటిషన్ విచారణకు బెంచ్ అందుబాటులో లేదు.

ఈ మేరకు జస్టిస్ అనిరుద్ధ బోస్,జస్టిస్ బేలా ఎం త్రివేది అందుబాటులో లేరని తెలుస్తోంది.దీంతో జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది బెంచ్ రద్దు అయింది.

అయితే ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విచారణ జరగాల్సి ఉన్న విషయం తెలిసిందే.కాగా ఈ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ ను ఏపీ హైకోర్టు రద్దు చేయడంతో దాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉంది.

బెంచ్ రద్దైన నేపథ్యంలో మరోరోజు చంద్రబాబు పిటిషన్ పై విచారణ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement
ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు