చంద్రబాబు దీక్ష స్థలంలో కేశినేని నాని ..!!

విజయవాడ ఎంపీ కేశినేని నాని నిరసన దీక్షలో పాల్గొన్నారు.దీక్ష చేపడుతున్న చంద్రబాబు ని పరామర్శించారు.

కాసేపు ఆయనతో వేదికపై కూర్చుని ముచ్చటించారు.మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం 36 గంటల చంద్రబాబు దీక్షకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు వస్తూ అధికార పార్టీ వైసీపీ పై మండి పడుతున్నారు.

ఇదిలావుంటే ఇటీవల గత కొన్ని రోజుల నుండి కేసినేని నాని తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ తన పార్టీ కార్యాలయంలో చంద్రబాబు ఫోటోతో పాటు మరి కొంతమంది టీడీపీ కీలక నాయకులు ఫోటోలను తొలగించినట్టు వార్తలు వచ్చాయి.అంతేకాకుండా రానున్న ఎన్నికలలో కేశినేని నాని ఎప్పుడూ కూడా టీడీపీ నుండి పోటీ చేసే అవకాశం లేదు.

అనే టాక్ వినిపించింది.ఇటువంటి తరుణంలో చంద్రబాబు తలపెట్టిన నిరసన దీక్షకి.

Advertisement

కేసినేని రావటం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో సొంత పార్టీకి చెందిన నాయకులు తనకు వ్యతిరేకంగా మారిన సమయంలో చంద్రబాబు వాళ్ళను మందలించకుండా ఉండటం తో.కేశినేని నాని పార్టీకి దూరం అయినట్లు వార్తలు వచ్చాయి.కానీ తాజాగా చంద్రబాబు దీక్షకి ఆయన హాజరు కావడంతో తెలుగుదేశం పార్టీలో ఉత్సాహం నెలకొంది.

నైజాంలో ఆ రికార్డ్ క్రియేట్ చేయనున్న పుష్ప ది రూల్.. బన్నీ క్రేజ్ కు ప్రూఫ్ ఇదే!
Advertisement

తాజా వార్తలు