ఏపీ సీఎం జగన్ ని ఫాలో అవుతూ కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అనుభవం లేకపోయినా ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా హైలెట్ అవుతున్నాయి.

ఏపీలో జగన్ అమలు చేస్తున్న కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ అధికారులు పనితనాన్ని పరిశీలించి వారి రాష్ట్రాలలో అమలు చేస్తూ ఉన్నారు.

ఇదిలావుంటే కరోనా సెకండ్ వేవ్ వలన చాలామంది దేశవ్యాప్తంగా మరణించిన సంగతి తెలిసిందే.ఏపీలో కూడా మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉండటంతో మరణాలు ఎక్కువ సంభవించడంతో.

కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను ఆదుకోవడం కోసం జగన్ ముందడుగు వేయడం తెలిసిందే.కరోనా వైరస్ కారణంగా తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలను గుర్తించి వారి పేరిట 10 లక్షలు ఫిక్సిడ్ డిపాజిట్ వేసి.

వారి భవిష్యత్ కి ఏర్పాటు చేసే రీతిలో జగన్ ప్రభుత్వం ప్లాన్ చేస్తూ ఉంది.ఈ రీతిగా అనాధలైన 74 మంది పిల్లలను ఏపీ ప్రభుత్వం గుర్తించింది.

Advertisement

కాక ఇదే రీతిలో కేరళలో కూడా అక్కడి ప్రభుత్వం కరోనా కారణం తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు అండగా నిలబడటానికి రెడీ అయింది.ఈ విధంగా అనాధలైన పిల్లలకు కేరళ ప్రభుత్వం మూడు లక్షలు అందించటానికి ముందడుగు వేసింది.

ఇదే రీతిలో దక్షిణాదిలో మరికొన్ని రాష్ట్రాలు తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలను ఆదుకోవడం కోసం ముందడుగు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు