మలయాళీ కుట్టిగా మోహనం చేస్తున్న కీర్తి సురేష్

సావిత్రి బయోపిక్ తో అభినవ సావిత్రిగా గుర్తింపు తెచ్చుకొని చిన్న వయసులోనే జాతీయ ఉత్తమ నటిగా అవార్డు సైతం గెలుచుకున్న మలయాళీ భామ కీర్తి సురేష్ అచ్చమైన తెలుగింటి అందంలా కనిపిస్తుంది.

ఏ భాష సినిమాలలో నటిస్తే ఆ ప్రాంతానికి చెందిన అమ్మాయిగా మారిపోవడం కీర్తి స్టైల్.

టాలీవుడ్ కి వచ్చినపుడు ఆమె ఆహార్యం అంతా తెలుగమ్మాయి స్టైల్ లో ఉంటుంది.ఇక కోలీవుడ్ కి వెళ్ళినపుడు తమిళ స్టైల్ లో ఉంటుంది.

ఇక స్వతహాగా మలయాళీ అయిన కీర్తి సురేష్ సొంత రాష్ట్రంలో మలయాళీ కుట్టీగా మైమరపిస్తుంది.ప్ర‌స్తుతం తెలుగులో గుడ్ ల‌క్ స‌ఖీ, రంగ్ దే, మిస్ ఇండియా చిత్రాలు కీర్తి సురేష్ చేస్తుంది.

దీంతో పాటు సొంత భాష మ‌ల‌యాళంలో మ‌ర‌క్క‌ర్ అర‌బిక‌డ‌లింతే సింహం అనే చిత్రంలో కీర్తి న‌టిస్తుంది.మోహ‌న్ లాల్ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తుండ‌గా, కీర్తి సురేష్ ముఖ్య పాత్ర‌లో క‌నిపించ‌నుంది.

Advertisement

ఈ సినిమాలో కీర్తి సురేష్ మ‌ల‌యాళీ గెట‌ప్‌కి సంబంధించిన ఫోటోలు చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

మహాన‌టి కోసం అచ్చమైన తెలుగమ్మాయిల క‌నిపించిన కీర్తి మ‌ర‌క్క‌ర్ అర‌బిక‌డ‌లింతే సింహం అనే చిత్రం కోసం మాల‌యాళీ కుట్టిలా మారింది.ప్రియదర్శన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కుతూ ఉండగా ఇందులో కీర్తి పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు