మరో బయోపిక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కీర్తి సురేష్

టాలీవుడ్ లో మహానటి సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న నటిగా కీర్తి సురేష్ కెరియర్ ఆరంభంలోనే అరుదైన గుర్తింపు సొంతం చేసుకుంది.

సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన ఈ సినిమాలో మరోసారి ఆమె ఒకప్పటి సావిత్రిని తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేసింది.

పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నిజంగా సావిత్రిని చూస్తున్నామా అనే ఫీలింగ్ లో ఆడియన్స్ ని తీసుకుపోయింది.దీంతో టాలీవుడ్ లో ఇప్పుడు కీర్తి సురేష్ ని అభినవ సావిత్రి అని అంటున్నారు.

Keerthi Suresh Green Signal To Once More Biopic In Tollywood-మరో బయ�

అయితే ఈ సినిమా తర్వాత మళ్ళీ హీరోయిన్ వెంటనే తెలుగులో మరో సినిమా చేస్తే మహానటి ప్రభావం ఉంటుందని భావించిన ఆమె రెండేళ్ళు గ్యాప్ తీసుకొని ప్రస్తుతం మిస్ ఇండియా సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతుంది.ఇక ఈ సినిమా తర్వాత నితిన్ కి జోడీగా నటించనుంది.

ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్తుంది.ఇదిలా ఉంటే కీర్తి సురేష్ టాలీవుడ్ లో మరో బయోపిక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

Advertisement

స్వాతంత్ర్యంకి ముందు జరిగిన కథతో ఈ సినిమా తెరకేక్కబోతుంది అని తెలుస్తుంది.పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా ఉండబోతుందని సమాచారం.

బ్రిటిష్ వారిపై పోరాటం చేసిన ఒక వీరనారి జీవిత కథ ఇదని టాక్ వినిపిస్తుంది.అయితే ఈ సినిమా దర్శకుడు ఎవరు? ఏ బ్యానర్ లో తెరకెక్కుతుంది అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది.మరి ఈ వార్తలలో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే అఫీషియల్ గా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.

Advertisement

తాజా వార్తలు