కత్రినా పెళ్లి వీడియో లీక్.. మీరు చూశారా.. ఎంత అందంగా ఉందో!

బాలీవుడ్ జంట కత్రినాకైఫ్, విక్కీ కౌశల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈ ప్రేమ జంట గత కొంత కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్నారు.

అయితే వీరు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అంటూ దాదాపుగా రెండు నెలలు ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అవుతూనే ఉంది.సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం ఈ జంట త్వరలోనే మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతోంది.

రాజస్థాన్ లోని సిక్స్ సెన్సెస్ పోర్ట్ లో ఈ వీరి పెళ్లి జరగబోతోంది.డిసెంబర్ 10న వీరిద్దరూ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు.

ఇప్పటికే ఈ ప్రేమ జంట పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో బోలెడు వార్తలు వినిపించాయి.వీరి పెళ్లికి అన్ని కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు, ఆ సెలబ్రిటీ హాజరుకానున్నారు ఇలా ఎన్నో రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

Advertisement

వీరి పెళ్లికి అతికొద్ది మంది బంధువులు, కొంత మంది సెలబ్రిటీలు మాత్రమే హాజరు కానున్నారు.పెళ్లికి హాజరైన వారికి ఈ జంట పలు నిబంధనలు కూడా పెట్టారు.

ఇకపోతే వీరి పెళ్లి పై ఎటువంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేయకపోవడం విశేషం.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కత్రినా పెళ్లి వీడియో లీక్ అయింది అంటూ ఒక క్లిపింగ్ వీడియో వైరల్ చేస్తున్నారు కత్రినా అభిమానులు.ఈ వీడియోలో అమితాబచ్చన్, జయా బచ్చన్ కూడా కనిపిస్తుండగా.ఈ వీడియో ఒక జ్యువెలరీ అడ్వటైజ్మెంట్ అనే తెలుస్తోంది.

ఈ వీడియోని చూసిన ఫ్యాన్స్ క్యాట్ మోస్ట్ బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది.మరి విక్కీ కౌశల్ ఎక్కడ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ ప్రశాంత్ మూవీకి ఆ టైటిల్ ను ఫిక్స్ చేయడం కష్టమే.. ఆ కష్టాన్ని అధిగమిస్తారా?
ఎన్టీఆర్ ఫ్యాన్ చేసిన పని తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. తారక్ ను చూడాలని 300 కిలోమీటర్లు నడిచాడా?

మొత్తానికి బాలీవుడ్ సినీ వర్గాలలో విక్కీ కౌశల్ కత్రినాకైఫ్ పెళ్లి విషయం హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు