Kartikeya Gummakonda : ఆ పోస్టుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన కార్తికేయ.. ఆ మాటలు నేను అనలేదంటూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరో కార్తికేయ( Tollywood Hero Karthikeya ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

కార్తికేయ తెలుగులో ఆర్ఎక్స్ 100( RX100 ), గుణ 369, చావు కబురు చల్లగా, 90ఎమ్ఎల్ ఇలాంటి సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు.

కార్తికేయ నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాలలో భారీగా అభిమానులను సంపాదించుకున్నాడు.ఇది ఇలా ఉంటే కార్తికేయ వలిమై సినిమా తర్వాత నటించిన తాజా చిత్రం బెదురులంక 2012( Bedurulanka 2012 ).

ఈ సినిమాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చేసిన మీడియాలో వైరల్ గా మారడంతో తాజాగా ఆ వాఖ్యలపై స్పందించాడు కార్తికేయ.

క్లాక్స్‌ దర్శకుడు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నేహా శెట్టి( Neha Shetty ) హీరోయిన్ గా నటించింది.త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ నేపథ్యంలో కార్తికేయ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

Advertisement

ఇంటర్వ్యూలో భాగంగా కార్తికేయ మాట్లాడుతూ.ఆర్‌ఎక్స్‌ 100 తర్వాత ప్రేక్షకులు నన్ను రొమాంటిక్‌ సీన్స్‌లో చూడటానికి ఇష్టపడుతున్నారు.

డీజే టిల్లు సినిమా( DJ Tillu )తో నేహా రొమాంటిక్‌ ఇమేజ్‌ ని సొంతం చేసుకున్నారు.ఆయా చిత్రాల్లో మా పాత్రలకు ఈ సినిమాలోని పాత్రలకు ఎలాంటి సంబంధం లేదు.

ఈ కథలోనే ఓ రొమాంటిక్‌ సీన్‌ ఉంది.మాపై రొమాంటిక్‌ ఇమేజ్‌ ఉంది.

దీంతో మా ఇద్దరిని ఎంచుకున్నారు అని కార్తికేయ తెలిపారు.అయితే దీనిని, ఉద్దేశిస్తూ ఓ నెటిజన్‌ పోస్టర్‌ క్రియేట్‌ చేశాడు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న తప్పు ఇదేనా.. అలా చేయడం వల్లే తక్కువ కలెక్షన్లు!
గుండెను తడిమిన పునీత్ పెయింటింగ్.. గీసింది ఎవరంటే...

ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో నాకు, డీజే టిల్లు తో నేహాకు రొమాంటిక్‌ ఇమేజ్‌ వచ్చింది.మా కాంబో మీద కొన్ని అంచనాలు ఉంటాయి.అందుకే బెదురులంక సినిమాలో రొమాంటిక్‌ సీన్స్‌( Romantic Scenes ) ఉన్నాయి అని కార్తికేయ చెప్పినట్లు ఆ పోస్టర్‌లో రాసుకొచ్చాడు.

Advertisement

దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఆగ్రహానికి గురైన కార్తికేయ.ఇలాంటివి పోస్ట్‌ చేసే ముందు దయచేసి పూర్తి ఇంటర్వ్యూ చూడండి.నేను ఈ మాటలు అనలేదు.

నటీనటుల ఇమేజ్‌ లేదా సినిమాను దెబ్బతీసేలా ఇలాంటి పోస్టులను దయచేసి పోస్ట్‌ చేయకండి అని ట్వీట్‌ చేశాడు కార్తికేయ.

తాజా వార్తలు