కంగనా,శివసేన ల మధ్య ముదురుతున్న రచ్చ...

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్,శివసేన ల మధ్య రచ్చ మరింత ముదురుతోంది.

సుశాంత్ ఆత్మహత్య ఘటన తరువాత కంగనా డైరెక్ట్ గా శివసేన ను టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే.

దీనితో వారి మధ్య వివాదం మరింత ముదిరి సవాల్ లు విసురుకొనే స్థాయికి వెళ్లిన విషయం విదితమే.ఒకపక్క పరిస్థితి ఇలా ఉండగా శివసేన ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు ఈ వివాదం మరింత ముదిరినట్లు అయ్యింది.

Arrest Sena MLA Women’s Body Chief On Slap Threat To Kangana Ranaut, Kangana R

దీనితో ఆయనను అరెస్ట్ చేయాలి అంటూ జాతీయ మహిళా కమీషన్ చైర్ పర్సన్ సైతం డిమాండ్ చేస్తున్నారు.సుశాంత్ ఆత్మహత్య ఘటన తరువాత కంగనా,శివసేన నేత సంజయ్ రౌత్ ల మధ్య వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఆమె ముంబై లోకి అడుగుపెట్టడానికి వీలులేదని ఆమె వస్తే రాళ్ల తోను, రాడ్ల తోను కొట్టి చంపుతామని శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సార్ నాయక్ ఒక ఇంటర్వ్యూ లో హెచ్చరించారు.అయితే ఎమ్మెల్యే తీరు పై మహిళా సంఘాలు మండిపడుతున్నారు.

Advertisement

జాతీయ మహిళా కమీషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించారు.ఆయనను ముంబై పోలీసులు వెంటనే అరెస్టు చేయాలంటూ ట్వీట్ చేశారు.

ఇతని వ్యాఖ్యలను పోలీసులు సుమోటోగా తీసుకోవాలన్నారు.మహారాష్ట్రలోని పాల్గర్ లో సాధువులను స్థానికులు కొట్టి చంపినట్టు కంగనాను కూడా కొట్టి చంపుతామని ప్రతాప్ సర్ నాయక్ ఇఛ్చిన వార్నింగ్ పట్ల రేఖాశర్మ మండిపడుతున్నారు తను ఈ నెల 9 న ముంబై విమానాశ్రయంలో అడుగుపెడతానని, దమ్ముంటే తనను అడ్డుకోవాలని కంగనా ప్రతిగా సవాల్ కూడా విసిరింది.

అయితే సేన ఎమ్మెల్యేల వ్యాఖ్యలతో ఈ వివాదం మరింత ముదిరిపోతోంది.మరి ఎమ్మెల్యే ను అరెస్ట్ చేయాలి అంటూ మహిళా కమీషన్ లు డిమాండ్ చేస్తుండడం తో ఈ వివాదం మరింత చర్చనీయాంశమైంది.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
Advertisement

తాజా వార్తలు