డ్రగ్స్ కేసులో సూపర్ స్టార్ ఫ్యామిలీ మెంబర్.....?!

కర్ణాటక సినీ పరిశ్రమలో డ్రగ్స్ మాఫియా కలకలం రేపిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 11 మందిని అదుపులోకి తీసుకున్న అధికారులు తాజాగా మరో ముగ్గురికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది.

వారిలో సూపర్ స్టార్ ఫ్యామిలీ రిలేటివ్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది.సూపర్ స్టార్ కృష్ణ భార్య,ప్రముఖ దర్శకురాలు విజయ నిర్మల మేనకోడలి భర్త,యాంకర్ కమ్ యాక్టర్ అకుల్ బాలాజీ కూడా ఆ లిస్ట్ లో ఉన్నట్లు తెలుస్తుంది.

Kannada Actors Akul Balaji Summoned By CCB Officials In Connection To Drug Probe

తాజాగా మరో ముగ్గురికి నోటీసులు జారీ చేయగా వారిలో నటుడు,వ్యాఖ్యాత అయిన అకుల్ బాలాజీ కూడా ఉన్నట్లు తెలుస్తుంది.అలానే మాజీ ఎమ్మెల్యే ఆర్.వి.దేవ్ రాజ్ తనయుడు ఆర్.వి.యువరాజ్, కొన్ని కన్నడ సినిమాల్లో నటించి మెప్పించిన హీరో సంతోష్ కుమార్ లకు కూడా అధికారులు శుక్రవారం నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది.శనివారం ఉదయం 10 గంటల సమయంలో తమ ముందు హాజరు కావాలి అంటూ అధికారులు నోటీసులు జారీ చేయగా ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న నేను రావడానికి కొంచం సమయం కావాలి అంటూ అకుల్ కోరగా,దానికి అధికారులు విమానంలో రావాలి అంటూ సూచన చేయడం తో ఈ రోజు నేరుగా ఆయన నగరానికి చేరుకోనున్నట్లు తెలుస్తుంది.

అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని, వ్యాఖ్యాత గా వ్యవహరించిన పలు తెలుగు, కన్నడ కార్యక్రమాల్లో నటీనటులు పాల్గొంటున్న నేపథ్యంలో తనకు కూడా నోటీసులు జారీ చేసి ఉంటారు అని అకుల్ భావిస్తున్నారు.మరి ఈరోజు పోలీసుల ఎదుట హాజరై వారు జరిపే విచారణ తరువాత అసలు విషయం ఏంటి అనేది తెలియనుంది.

Advertisement
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023

తాజా వార్తలు