బాలయ్య సినిమా కోసం భారీగా డిమాండ్ చేస్తున్న కాజల్ ... ఎన్ని కోట్లో తెలుసా

వెండితెర చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకున్న వెంటనే ప్రెగ్నెంట్ కావడంతో ఈమె సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.

అయితే ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు.ఇప్పటికే ఈమె కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఇండియన్ 2 సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు.

అదే విధంగా చంద్రముఖి2 లో కూడా కాజల్ అగర్వాల్ నటిస్తున్నట్టు సమాచారం.

ఇదిలా ఉండగా తాజాగా ఈమె బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమాలో కూడా బాలయ్యకు హీరోయిన్ గా నటించబోతుందని వార్తలు వస్తున్నాయి.అయితే ఇప్పటివరకు ఈ వార్తల గురించి ఏ విధమైనటువంటి అధికారక ప్రకటన లేకపోయినా ఈ వార్తలు వైరల్ గా మారాయి.వీర సింహారెడ్డి సినిమాతో సక్సెస్ అందుకున్న బాలకృష్ణ తన తదుపరిచిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్నారు.

Advertisement

ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది.అయితే ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటించబోతున్నట్లు సమాచారం ఈసారి బాలయ్య నటిస్తున్న ఈ సినిమా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు సమాచారం.ఇందులో సీనియర్ బాలకృష్ణకు జోడిగా కాజల్ అగర్వాల్ నటించబోతుందని తెలుస్తోంది.

అయితే ఈ సినిమాలో నటించడం కోసం కాజల్ అగర్వాల్ ఏకంగా నాలుగు కోట్ల రూపాయలు డిమాండ్ చేసినప్పటికీ మేకర్స్ ఈమె అడిగిన మొత్తాన్ని ఇవ్వడానికి సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.మరి కాజల్ అగర్వాల్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు