కాజల్ బిడ్డకు జన్మనిచ్చేది ఆ నెలలోనే.. ఆ ఫోటోతో అన్నీ లీక్?

టాలీవుడ్ బ్యూటీ చందమామ కాజల్ అగర్వాల్ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

కాజల్ అగర్వాల్ గత ఏడాది తన చిన్ననాటి స్నేహితుడు వ్యాపారవేత్త గౌతమ్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ చెబుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు.ఇక అందరూ ఎదురు చూసిన విధంగా ఈ ఏడాది ఆరంభంలో కాజల్ అగర్వాల్ తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన తెలిసింది.

ఇక అప్పటి నుంచి కాజల్ అగర్వాల్ ప్రెగ్నెన్సీ కి సంబంధించిన ఏదో ఒక విషయంపై సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంది.త్వరలోనే కాజల్ అగర్వాల్ తల్లి కాబోతోంది.

ఈ మేరకు తాజాగా తన కుటుంబ సభ్యులు బంధువుల సమక్షంలో సీమంతం నిర్వహించారు.అందుకు సంబంధించిన ఫోటోలను కాజల్ అగర్వాల్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో పంచుకుంది.

Advertisement
Kajal Gives Birth To A Baby In The Same Month All Things Leaked With That Photo,

ఆ ఫోటోలలో కాజల్ అగర్వాల్ ఎరుపు రంగు చీర కట్టుకొని మెరిసింది.

Kajal Gives Birth To A Baby In The Same Month All Things Leaked With That Photo,

ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఒక ఫోటో లో మమ్మీ కమింగ్ సూన్ మే 2022 అంటూ రాసుకొచ్చింది కాజల్ అగర్వాల్.దానిని బట్టి చూస్తే కాజల్ అగర్వాల్ డెలివరీ డేట్ మే నెలలో అని తెలుస్తోంది.

ఈ ఫోటోలను చూసిన అభిమానులు కూడా కాజల్ అగర్వాల్ కు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇకపోతే కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఆచార్య సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021
Advertisement

తాజా వార్తలు