మన జీవితంలో ఎన్నో మారాయి...నీపై నాకున్న ప్రేమ తగ్గదు... భర్త గురించి ఎమోషనల్ పోస్ట్ చేసిన కాజల్!

వెండితెర చందమామ కాజల్ అగర్వాల్ దక్షిణాది సినిమా ఇండస్ట్రీ లోనే కాకుండా ఉత్తరాది రాష్ట్రాలలో కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని వరుస సినిమాలతో దూసుకుపోతోంది.

ఇకపోతే ఈమె 2020 వ సంవత్సరంలో తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

ఇక ఈ ఏడాది కాజల్ అగర్వాల్ ఒక పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.ఇక ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ తన భర్త గౌతమ్ గురించి సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ప్రతి ఒక్క అమ్మాయి కోరుకునే విధంగా ఉన్న తన భర్త, కాబోయే తండ్రి గౌతమ్ కు థాంక్స్.నేను గర్భందాల్చినప్పటి నుంచి ప్రతి క్షణం నన్ను కంటికి రెప్పలా కాపాడుతూ నా ప్రతి యొక్క అవసరాన్ని తెలుసుకొని నా వెంటే ఉండి నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నావు.

ప్రతి ఒక్క విషయంలోనూ నాకు తోడుగా ఉండి నాపై చూపించిన ప్రేమ మీరు మీ బిడ్డకు గొప్ప తండ్రి అవుతారని భావిస్తున్నాను.గత ఎనిమిది నెలల నుంచి మీరు ఒక అద్భుతమైన తండ్రిగా మారడం నేను చూశాను మనకు పుట్టబోయే పాప కోసం మీరు ఎంత శ్రద్ధ చూపిస్తున్నారో నాకు తెలుసు.

Kajal Emotional Post About Her Husband Details, Kajal Agarwal, Tollywood, Emotio
Advertisement
Kajal Emotional Post About Her Husband Details, Kajal Agarwal, Tollywood, Emotio

మనకు పుట్టబోయే బిడ్డ తనని అమితంగా ప్రేమించే ఒక తండ్రిని, రోల్ మోడల్ ని చూస్తుంది.దీనిని నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను.మన జీవితంలో ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపాము, ఇలా మన జీవితంలో ఎన్నో మార్పులు వచ్చినప్పటికీ నాకు నీ పై ఉన్న ప్రేమ ఎప్పటికి తగ్గదు, నీపై ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంటుంది అంటూ కాజల్ అగర్వాల్ తన భర్త గురించి ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు