Thulasi Nair: మనసులను హత్తుకున్న కడలి సినిమా హీరోయిన్ గుర్తుందా ?

సరిగ్గా పదేళ్ల క్రితం మణిరత్నం దర్శకత్వం వహించిన కడలి సినిమా( Kadali Movie ) మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది.

ఇది తెలుగులో కడలి అనే పేరుతో విడుదలైన తమిళ్లో కాదల్ అనే పేరుతో వచ్చింది.

ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో అప్పట్లో అందరూ ఈ సినిమాలో నటించిన నటీనటుల గురించి మాట్లాడుకున్నారు.ఇక కడలి సినిమాలో ప్రముఖ తమిళ నటుడు మరియు హీరో అయినా కార్తీక్ కుమారుడు గౌతమ్ కార్తీక్( Gautam Karthik ) హీరోగా నటించగా, హీరోయిన్ గా హీరోయిన్ రాధ చిన్న కుమార్తె తులసి నాయర్( Thulasi Nair ) నటించింది.

అయితే అప్పుడెప్పుడో వచ్చిన కడలి సినిమా గురించి ఇప్పుడెందుకు మాట్లాడుకుంటున్నాం అనే కదా మీ సందేహం.ఆ పాయింట్ కె వస్తున్నాను.

ఈ సినిమాలో నటించిన తులసి నాయర్ ప్రస్తుతం ఎలా ఉంది ? ఎక్కడ ఉంది ? అనే విషయాల గురించి తెలుసుకోవడమే ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం.

Advertisement

తులసి నాయర్ విషయానికొస్తే ఆమె తొలిసారిగా నటించింది కడలి సినిమాలోనే.తులసి మరెవరో కాదు ఆపట్లో సౌత్ ఇండియాలో అనేక సినిమాల్లో నటించి దక్షణాదిన ఒక ఊపు ఊపిన స్టార్ హీరోయిన్ రాధ( Heroine Radha ) యొక్క చిన్న కుమార్తె.రాధకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు .అందులో మొదటి అమ్మాయి కార్తీక నాయర్( Karthika Nair ) కాగా, రెండో అమ్మాయి తులసి నాయర్.కార్తీక తెలుగులో నాగార్జున కుమారుడు నాగచైతన్య హీరోగా వచ్చిన జోష్ చిత్రంతో( Josh Movie ) మొట్టమొదటిసారిగా హీరోయిన్ గా నటించింది.

కానీ ఆ సినిమా పరాజయం పాలవడంతో తెలుగు నుంచి నిష్ప్రమించింది.ఆమె తెలుగులో సక్సెస్ కాలేదు కానీ తమిళ్లో ఆమెకు రంగం సినిమా మంచి పేరు తీసుకొచ్చింది.

ప్రస్తుతం కార్తీక పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది కాగా, ఆమె చెల్లి తులసి నాయర్ కూడా సినిమా ఇండస్ట్రీలో రాణించింది.

తులసి నాయర్ కడలి సినిమాలో నటించిన తర్వాత రంగం- 2( Rangam 2 ) సినిమాలో కూడా నటించింది.రంగం మొదటి భాగంలో అక్క కార్తీగా నటిస్తే రంగం రెండవ భాగంలో చెల్లెలు తులసి నటించింది.అయితే ఈ రెండు సినిమాల ద్వారా మాత్రం ఆమె పెద్దగా పాపులర్ కాలేకపోయింది.

పుష్ప2 హిట్టైనా నోరు మెదపని టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఇంత కుళ్లు ఎందుకు?
వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం .. భారతీయులకు మేలు !

దాంతో ఆమె సినిమా పరిశ్రమ నుంచి పూర్తిగా నిష్క్రమన తీసుకోవాల్సి వచ్చింది.అయితే సోషల్ మీడియాలో బాగానే హడావిడి చేసే తులసి తన అక్క కార్తీక వివాహ సమయంలో బాగా హైలైట్ గా కనిపించారు.

Advertisement

మొదట ఆమెను బొద్దుగా మారడంతో ఎవరు గుర్తుపట్టలేదు కానీ సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించేసరికి ఎక్కడో చూసినట్టు ఉంది అని మాత్రం అనుకున్నారు.

తాజా వార్తలు