టాలీవుడ్ లో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్.బాలయ్య తర్వాత నందమూరి ఫ్యామిలీలో ఆ స్థాయిలో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న తారక్ ఈ మధ్యకాలంలో తన లుక్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు.
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్న సంగతి అందరికీ తెలిసిందే.ఇక ఈ పాత్ర కోసం తారక్ పూర్తిగా తన లుక్ ని మార్చేసి కొత్త లుక్ లోకి వచ్చేసాడు.
అదే సమయంలో బాగా స్లిమ్ అయ్యాడు.
ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా తాజాగా ఎన్టీఆర్ కు సంబంధించిన కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఫిజ్ అనే సాఫ్ట్ డ్రింక్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఎన్టీఆర్ తాజాగా యాడ్ షూటింగ్ లో పాల్గొన్నాడు.ఈ షూటింగ్ సంబంధించిన ఫోటోలు సాఫ్ట్ డ్రింక్ కంపెనీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
డ్రింక్ పట్టుకుని ఉన్న ఎన్టీఆర్ లుక్ షేర్ చేసిన కొద్దిసేపటికే వైరల్ గా మారింది.చాలా స్టైలిష్ గా సన్నగా ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు నందమూరి అభిమానులను ఈ లుక్ లో ఫిదా చేస్తున్నారు.
ఈ మధ్యకాలంలో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కారణంగా ఎక్కువగా బయటకు రాని తారక్ ఇలా కొత్త లుక్ లో కనిపించడంతో ఈ ఫోటోలను ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తూ వైరల్ గా మార్చేసారు.