Junior NTR : యాడ్ తో విజిల్స్ వేయిస్తున్న ఎన్టీఆర్ కృతిసనన్.. ఆ బ్రాండ్ సేల్స్ పెరుగుతాయా?

సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ ఉంటారు.రెండు చేతులతో సంపాదిస్తూ భారీగా వెనకేసుకుంటూ ఉంటారు.

ఇప్పటికే బాలీవుడ్ టాలీవుడ్ లో ఎంతో మంది సెలబ్రిటీలు పలు రకాల బ్రాండ్స్ కు అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.ఇకపోతే టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు అందరూ యాడ్స్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

వారిలో పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) కూడా ఒకరు.ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం తెలిసిందే.

Jr Ntr And Kriti Sanon Joined For Appy Fizz Ad Video Viral

ప్రస్తుతం కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో రెడీ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు.ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో జూనియర్ ఎన్టీఆర్ కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తున్నాడు.కాగా ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ఫాంటా, లిషియస్ బ్రాండ్స్ కి ప్రమోటర్ గా ఉన్న విషయం మనందరికి తెలిసిందే.

Advertisement
Jr Ntr And Kriti Sanon Joined For Appy Fizz Ad Video Viral-Junior NTR : యా�

ఇప్పుడు మరో బ్రాండ్ కి ప్రమోటర్ గా మారిపోయాడు.ఇది ఇలా ఉంటే తాజాగా మరో డ్రింక్ కే బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు ఎన్టీఆర్.యాపిల్ ఫిజా( Apple Fiza ) బ్రాండ్ ప్రవేశపెడుతున్న కొత్త రకం కూల్ డ్రింక్ కీ జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కృతి సనన్( Kriti Sanon ) కూడా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది.

Jr Ntr And Kriti Sanon Joined For Appy Fizz Ad Video Viral

వీరిద్దరికి సంబంధించి కమర్షియల్ యాడ్.ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది.ఎన్టీఆర్, కృతి సనన్ ఇద్దరూ యాడ్ లో సూట్స్ తో మెరిసిపోతున్నారు.

అందులో ఇద్దరు చాలా స్టైలిష్ గా వీరి జంట ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటోంది.ఎన్టీఆర్,కృతి కాంబినేషన్ లో సినిమా రాకపోయినా కనీసం యాడ్ అయినా వచ్చింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం అందుకు సంబందించిన వీడియో యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది.

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?
Advertisement

తాజా వార్తలు