జనసేన బలోపేతానికి కొణతాల చేరిక దోహదపడుతుంది..: పవన్ కల్యాణ్

సీనియర్ నేత కొణతాల రామకృష్ణ( Konathala Ramakrishna ) జనసేన పార్టీలో చేరాలనుకోవడం హర్షణీయమని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) అన్నారు.ఈ క్రమంలో కొణతాలను జనసేనలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు.

రాష్ట్ర అభివృద్ధితో పాటు క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారంపై స్పష్టత ఉన్న నాయకుడు కొణతాలని జనసేనాని తెలిపారు.అలాగే జనసేన( Janasena ) బలోపేతానికి కొణతాల చేరిక దోహదపడుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.అయితే అనాకపల్లిలో నిర్వహించిన అభిమానుల ఆత్మీయ సమావేశంలో జనసేనలో చేరుతున్నట్లు కొణతాల రామకృష్ణ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు