జేడీ లక్ష్మీనారాయణ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు గతంలోనే ప్రకటించడం తెలిసిందే.ఆ సమయంలో తన భావజాలాలకు అనుగుణంగా ఉండే పార్టీలో జాయిన్ అయ్యి విశాఖపట్నం పార్లమెంటు స్థానం నుండి పోటీ చేయబోతున్నట్లు తెలిపారు.
ఈ క్రమంలో టీడీపి, బీజీపీ నుండి పోటి చేయనున్నట్లు వార్తలు వచ్చాయి.అయితే తాజాగా జేడీ ఫౌండేషన్ కోఆర్డినేటర్ జగన్ మురారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికలలో విశాఖపట్నం లోక్ సభ సభ్యునిగా అది కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేయబోతున్నట్లు తెలిపారు.
దీంతో జగన్ మురారి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.2019 ఎన్నికల సమయంలో విశాఖపట్నం పార్లమెంటుకి జనసేన పార్టీ తరఫున పోటీ చేసి జేడీ లక్ష్మీనారాయణ ఓడిపోయారు.ఆ తర్వాత జనసేన పార్టీకి రాజీనామా చేయడం జరిగింది.
ఈ క్రమంలో పలు సమావేశాలలో పాల్గొన్న జేడీ లక్ష్మీనారాయణ 2024 ఎన్నికలలో ఖచ్చితంగా మళ్లీ పోటీ చేస్తానని.అది కూడా ఓడిపోయిన విశాఖ పార్లమెంట్ నుండి అని తెలిపారు.
అయితే ఈసారి మాత్రం ఇండిపెండెంట్ గా జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నట్లు జేడీ ఫౌండేషన్ కోఆర్డినేటర్ తెలియజేయడం జరిగింది.