కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) మాజీ సీఎం కేసీఆర్ పై( KCR ) సీరియస్ వ్యాఖ్యలు చేశారు.చార్లెస్ శోభరాజ్ ఇప్పుడు ఇంట్లో పడుకున్నారని.
మరోవైపు బిల్లా, రంగాలు ఏదేదో మాట్లాడుతున్నారు.ఊరూరు తిరుగుతూ పులి బయటకు వస్తుందని చెబుతున్నారు.
కానీ పులి బయటకు వస్తే బోను రెడీగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అధికారంలోకి వచ్చిన 100 రోజులలో హామీలు నెరవేరుస్తామని చెప్పాము.
కానీ బిల్లా, రంగాలు మాత్రం 50 రోజులు గడవకముందే హామీలు అమలు చేశారా.అంటూ ప్రశ్నిస్తున్నారని విమర్శలు చేశారు.చార్లెస్ శోభరాజ్ బయటకు రమ్మనండి అంటూ సీఎం సవాల్ చేశారు.పదేళ్ళు అధికారంలో ఉండి దోచుకున్న మిమ్మల్ని అవమానించారు.మమ్మల్ని క్షమించండి అంటూ వారు తిరుగుతున్నారు.100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్లు వారి వైఖరి ఉంది.
ఎన్నికలలో బీఆర్ఎస్( BRS ) బొక్క బోర్ల పడటం వల్లే బయటకు రాలేకపోతున్నారు.బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి దళితులకు( Dalits ) మూడు ఎకరాల భూమి కూడా ఇవ్వలేదు.పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదు, ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదు, మైనారిటీలకు 12 శాతం, గిరిజనులకు 12శాతం.రిజర్వేషన్ ఇవ్వలేదని విమర్శించారు.ఒక్క హామీ నెరవేర్చని బీఆర్ఎస్ కి.
మా గ్యారెంటీ లపై ప్రశ్నించే అర్హత ఉందా అని సిఎం రేవంత్ రెడ్డి సీరియస్ వ్యాఖ్యలు చేశారు.అవినీతిపరులను, కోటీశ్వరులను కేసీఆర్ రాజ్యసభకు పంపించారు.పులి బయటకు వస్తే బోనులో పెట్టి బొంద పెడతాం.
అభ్యర్థులను మారిస్తే గెలిచే వాళ్ళమని గొప్పలు చెప్పుకుంటున్నారు.మార్చాల్సింది అభ్యర్థులను కాదు కేసీఆర్ కుటుంబాన్ని అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.