జేబీఎల్ నుంచి ప్రీమియం హెడ్‌ఫోన్స్‌ లాంచ్.. ధర తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు!

సాధారణంగా పదివేలు పెడితే బెస్ట్ ఇయర్‌ఫోన్స్‌, హెడ్‌ఫోన్లు దొరుకుతాయి.మధ్య తరగతి వారు ఇంతకంటే ఎక్కువ రేటు పెట్టలేరు.

కానీ ధనవంతులు మాత్రం ఎంత డబ్బు అయినా ఖర్చు చేస్తారు.అలాంటి వారి కోసం లక్షల రూపాయల ఖరీదైన హెడ్‌ఫోన్స్‌ ( Headphones ) కూడా కంపెనీలు లాంచ్ చేస్తున్నాయి.

వీటిని చెవిలో పెట్టుకుంటే చాలు మ్యూజిక్‌లో లీనం అయిపోవచ్చు.సరిగ్గా అలాంటి అనుభూతే అందించేందుకు జేబీఎల్ (JBL) తన టూర్ వన్ M2 వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌ను( Tour One M2 ) విడుదల చేసింది.

ఇది సోనీ, సెన్‌హైజర్ వంటి దిగ్గజ బ్రాండ్‌లతో పోటీ పడే ఒక హై-ఎండ్ ప్రొడక్ట్.

Advertisement

ఇక ఈ సరికొత్త టూర్ వన్ M2 హెడ్‌ఫోన్స్‌లో అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, నాలుగు బిల్ట్-ఇన్ మైక్‌లు, 40మిమీ డైనమిక్ డ్రైవర్లు, రబ్బరైజ్డ్ మెటీరియల్స్‌తో చేసిన కేబుల్స్‌ ఉన్నాయి.హై-రెస్ లెజెండరీ ప్రో సౌండ్ అవుట్‌పుట్‌ను అందించే ఈ హెడ్ ఫోన్స్ ద్వారా అద్భుతమైన అనుభూతిని ఆస్వాదించొచ్చు.ఈ ప్రొడక్ట్ బాడీ కార్బన్ ఫైబర్‌తో తయారు చేశారు కాబట్టి ఇది తేలికగా ఉంటుంది.

హెడ్‌ఫోన్ బరువు కేవలం 268 గ్రాములు ఉంటుంది.

ఈ హెడ్‌ఫోన్స్‌ ఆండ్రాయిడ్, విండోస్, ఐఓఎస్ డివైజ్‌లతో కనెక్ట్ అవుతాయి.గూగుల్ అసిస్టెంట్, అలెక్సా వంటి వాయిస్ అసిస్టెంట్‌లకు మద్దతు ఇస్తాయి.కొత్త హెడ్‌ఫోన్స్‌ 920mAh బ్యాటరీతో వస్తాయి.

యూఎస్‌బీ C పోర్ట్ ద్వారా ఫాస్ట్ ఛార్జింగ్‌ చేసుకోవచ్చు.లిమిటెడ్ టైమ్ ఆఫర్ కింద ఈ హెడ్‌ఫోన్‌ల ధరను రూ.24,999గా కంపెనీ నిర్ణయించింది.ఆ తర్వాత వాటి ధర రూ.34,999కి పెరుగుతుంది.ఈ ధర చూసి చాలామంది ముక్కున వేలేసుకుంటున్నారు.

సోదరి, బావ కలిసి చేతబడి చేశారంటూ పోలీస్ కంప్లైంట్.. అధికారులు షాక్..??
Advertisement

తాజా వార్తలు