తెలంగాణ రాజకీయాలు ముదిరిపాకనపడ్డాయి ఇప్పటివరకు టీఎస్పీఎస్సీ వ్యవహారంలో అధికార పార్టీ ఉక్కిరి బిక్కిరి అవ్వగా ఇప్పుడు పదవ తరగతి పరీక్ష పేపర్ లీకేజ్ విషయంలో తెలంగాణ బిజెపి ఇరుకున పడింది….సాక్షాత్తు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు ఈ కేసులో A1 గా అరెస్ట్ అవటం తెలంగాణ రాజకీయాలలో సంచలమైనది.
ఈ కేసు లో కీలక సూత్రదారి అని పోలీసులు చెప్తున్న మాజీ జర్నలిస్ట్ ప్రశాంత్( Prashanth ) ప్రస్తుత బీజేపీ కార్యకర్త అని అంతేకాకుండా ఆయన బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay ) కుడి భుజంగా వ్యవహరిస్తున్నాడని పోలీసులు చెప్తున్నారు….ఈ లీకేజ్ విషయంలో బండి సంజయ్ తో అనేకసార్లు ఫోన్లో మాట్లాడిన కాల్ రికార్డింగ్ ఉన్నాయని, లీక్ చేసిన పేపర్ ను బండి సంజయ్ వాట్సాప్ కు కూడా నిందితుడు పంపించాడని పోలీసులు చెబుతున్నారు .ఈ ఈ కేసులు బండి సంజయ్ అరెస్ట్ చేసిన పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయ మూర్తి బండి సంజయ్ కు 14 రోజులు రిమాండ్ విధించారు.

జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బిజెపి ఈ విషయంలో కార్నర్ అయ్యిందని అనిపిస్తుంది కేంద్రంతో డి అంటే డి అంటున్న కేసీఆర్ కు ఇప్పుడు ఈ కేసు బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుందని , దీన్ని అడ్డు పెట్టుకుని బజాపా( BJP ) ను రాష్ట్రం లో బద్నాం చేస్తారని ,ఇందులో నుంచి బయటపడటం బండి సంజయ్ కు అంత ఈజీ కాదు అని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి….రాజకీయాలకు అతీతంగా నిజాయితీగా డ్యూటీ చేస్తారన్న పేరున్న వరంగల్ సిపి రంగనాథ్ ఈ కేస్ డీల్ చేయటం వల్ల కేసు విచారణ నిజాయితీగానే జరిగే అవకాశం ఉంది.

నేరం చేసిన వాళ్ళు అధికార పార్టీ కార్పొరేటర్లు అయినా కూడా వదలకుండా అరెస్ట్ చేసిన చరిత్ర ఉంది.అయితే ఇందులో బండి సంజయ్ పాత్ర పై ఆధారాలు కూడా ఉండటం ఆయన ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అవ్వడం వల్ల ఎంత కాదు అనుకున్న రాజకీయ సమీకరణాలు మొత్తం ఈ కేసు చుట్టూ తిరుగుతాయి ….అందువల్ల అధికార ఒత్తిడిని తట్టుకొని ఈ కేసుని ఏ విదం గా ముందుకు తీసుకు వెళతారో అన్న ఆసక్తి సమాన్యులలో కలుగుతుంది తెలంగాణ రాజకీయాల మొత్తం పరీక్ష లీకేజ్ లు లు చుట్టూ తిరగడం చూస్తుంటే అధికారం కోసం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని సాధారణ ప్రజలు విమర్శిస్తున్నారు….







