వరద బాధితులకు అండగా జనసేనాని.. కోటి విరాళం

గత కొద్దీ రోజులుగా వరదలతో సతమతమౌతున్న హైదరాబాద్ మహా నగరానికి జనసేనాని పవన్ కళ్యాణ్ తన వంతు సాయం ప్రకటించారు.

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తడం తో నగరవాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.

గత కొన్నేళ్లుగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురవడం తో భాగ్యనగర వీధులన్నీ చెరువులను తలపిస్తున్నాయి.ఈ భారీ వరదల కారణంగా ఎంతోమంది నిరాశ్రయులయ్యారు.

Janasena Chief Power Star Pawan Kalyan Donates Rupees 1 Crore To Telangana CM Re

వాళ్ల జీవితాలు నీట మునిగిపోయాయి.అయితే వరద బాధితుల కోసం అటు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు సాయం ను ప్రకటించగా, టాలీవుడ్ ప్రముఖులు కూడా వరద బాధితుల కోసం సాయం చేయడానికి ముందుకువచ్చారు.

సీఎం కేసీఆర్ అభ్యర్ధన మేరకు పలువురు టాలీవుడ్ ప్రముఖులు మెగాస్టార్,ప్రభాస్, మహేష్ బాబు, అలానే నటసింహం బాలకృష్ణ లు సహాయం ప్రకటించగా.తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తమ వంతు సాయం ప్రకటించారు.

Advertisement

భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంలో ప్రజల పరిస్థితి ప్రస్తుతం చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లుగా మారిపోయింది.ఇలాంటి సమయంలో వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ కూడా రూ.10 వేల సాయం అందించగా, అటు తమిళనాడు సర్కార్ రూ.10 కోట్లు,అలానే ఢిల్లీ ప్రభుత్వం రూ.15 కోట్లు, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రూ.2 కోట్ల రూపాయల ఆర్ధిక సాయం ప్రకటించాయి.ఈ క్రమంలో పలువురు సినీ హీరోలు తెలంగాణ సహాయ నిధికి తమ వంతు సాయం చేస్తున్నారు.నందమూరి బాలకృష్ణ హైదరాబాద్ వరద బాధితులకు రూ.1.50 కోటి విరాళం ప్రకటించగా, మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు లు రూ.కోటి విరాళం ప్రకటించారు.అటు నాగార్జున,ఎన్టీఆర్, రూ.50 లక్షల విరాళం ప్రకటించారు.అటు విజయ్ దేవరకొండ రూ.10 లక్షలు, రామ్ రూ.25 లక్షల విరాళం ప్రకటించారు.తాజాగా హైదరాబాద్ వరద బాధితులకు జనసేనాని అండగా నిలిచారు.

సీఎం సహాయ నిధికి కోటి విరాళం అందిస్తున్నట్లు ఆయన తాజాగా ప్రకటించారు.వరదలు, భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన నగరవాసులకు తమ వంతుగా ఈ సాయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తున్నట్టు ప్రకటించారు.

అలానే భాగ్యనగర వాసులకు సాయం అందించడానికి ముందుకు రావాలి అంటూ జనసైనికులకు కూడా పిలుపు నిచ్చారు.మరోవైపు సినీ దర్శకులు త్రివక్రమ్ తన వంతుగా రూ.10 లక్షల విరాళం ప్రకటించగా, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి చెరో రూ.5 లక్షల విరాళం ప్రకటించారు.మరోవైపు ప్రముఖ నిర్మాణ సంస్థలు హారికా అండ్ హాసిని క్రియేషన్స్‌తో పాటు మైత్రీ మూవీ మేకర్స్ కూడా చెరో రూ.10 లక్షల విరాళం ప్రకటించి తెలంగాణా ప్రజలకు అండగా నిలిచారు.

రోడ్డుపై గొనె సంచిలోనుండి అరుపులు.. తెరిచి చూడగా షాకింగ్ సిన్!
Advertisement

తాజా వార్తలు