జై జాస్తి, అనంతిక, జంటగా సన్నీల్ కుమార్, వెన్నెల కిషోర్, ప్రవీణ్, ప్రణీత్ పట్నాయక్ ముఖ్యపాత్రల్లో రూపొందుతున్న చిత్రం రాజమండ్రి రోజ్ మిల్క్.
డి.సురేష్‌బాబు, ప్రదీప్ ఉప్పలపాటి నిర్మాతలు.ప్రస్తుతం రాజమండ్రిలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం విశేషాలను దర్శకుడు నాని బండ్రెడ్డి తెలియజేస్తూ ఇటీవల ఈ చిత్రంలోని ఊకో ఊకో అనే లిరికల్ సాంగ్‌ను రాజమండ్రిలోని వర్ధమాన్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రముఖ యువ దర్శకుడు బుచ్చిబాబు సనా విడుదల చేశారు.
పూర్తి యూత్‌ఫుల్ కొనసాగే ఈ పాటకు మంచి స్పందన వస్తోంది.శ్రీమణి సాహిత్యం అందించన ఈ పాటను యశ్వంత్‌నాగ్ స్వరపరచి, ఆలపించాడు.పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ అందరికి కాలేజీ రోజులను గుర్తుచేస్తుంది.
కాలేజీ రోజుల్లో జరిగిన మరపురాని సంఘటనలను ఈ చిత్రం జ్ఞప్తికి తెస్తుంది అన్నారు.ఈ చిత్రానికి సంగీతం: జస్టిన్ వర్గీస్, గోవింద్ వసంత్, అజయ్ అరసాడ, యశ్వంత్ నాగ్, భరత్-సౌరభ్, డీఓపీ: ముఖేష్.జి, సాహిత్యం: చంద్రబోస్, అనంత్‌శ్రీరామ్, శ్రీమణి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy