వైసీపీ ప్రభుత్వంపై ఆర్.బీ.ఐ, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి..యనమల

రూ.12.50 లక్షల కోట్లు దాటిపోయిన రాష్ర్ట అప్పులు ప్రతి పౌరుడిపై రూ.

5.50 లక్షల అప్పు జగన్ పాలనలో రాష్ట్రం అధోగతిపాలు ఆర్థిక పరిస్థతిపై కేంద్రం, ఆర్.బీ.ఐ వెంటనే స్పందించాలి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ప్రతి పౌరుడిపై సగటున రూ.5.50 లక్షల అప్పు భారం మోపింది.ఇప్పటికే రాష్ట్ర అప్పు రూ.12.50 లక్షల కోట్లకు దాటిపోయింది.అయినా అటు కేంద్రం గాని, ఆర్.బి.ఐ గాని ఇంత వరకు ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదని శాసనమండలి ప్రతిపక్షనాయకుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆవేదన వ్యక్తం చేశారు.జగన్ పాలనలో ఈ రాష్ట్రం అధోగతిపాలైంది.

ఇంతటి దుర్భర పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు.వైసీపీ ప్రభుత్వం సమస్యల్ని సృష్టించడమే కాకుండా ఆర్థిక వ్యవస్థని కుదేలు చేసింది.

ఆర్థిక వ్యవస్థను అధ: పాతాళానికి నెట్టిన ఘనత జగన్మోహన్‌రెడ్డిది.అని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ పై మూడేళ్ల సీఐజీ రిపోర్టులు తీసుకొని విశ్లేషణ చేయడం జరిగింది.జగన్ రెడ్డి పాలన అంతమయ్యే సమయానికి ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ రూ.2.5 లక్షల కోట్లకు చేరుకుంటాయి.ఆఫ్ బడ్జెట్ బారాయిన్స్ కూడా దాదాపు 5 సంవత్సరాల్లో ఇంచుమించు రూ.5 లక్షల కోట్లు అవుతున్నాయి.ఓడి, స్పెషల్ డ్రాయింగ్ అలవెన్సులు మూడు కలిపి ఈ 5 సంవత్సరాల్లో రూ.5 లక్షల కోట్లకు చేరబోతున్నాయి.అన్నీ కలిపి రూ.12.5 లక్షల కోట్లకు చేరుకునే ప్రమాదం ఉంది.మార్చి 2024 నాటికి ఔట్ స్టాండింగ్ అప్పులు పెరగనున్నాయి.

Advertisement

ఇంత జరుగుతున్నా ఆర్బీఐ ఇంకా అప్పులకు అనుమతులు ఇస్తూనే ఉంది.మరోవైపు రాబోయే భవిష్యత్తు కాలంలో ఆర్టీసీ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు, రోజువారి నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగి రూ.15,000 కోట్ల భారం ప్రజలపై పడనుంది.జనాభా పరంగా దేశంలోనే ఏపీ రెండో స్థానంలో ఉంది.

ఫలితంగా ధరలు అధికంగా పెరిగాయి.ఐదేళ్లలో రూ.75,000 కోట్ల మేర అదనంగా భారం పడింది.రాష్ట్ర ప్రభుత్వం అధిక వడ్డీలు తీసుకురావడం ఒక్కొక్కరిపై రూ.5,50,000 వరకు అదనంగా భారం పడింది.రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ( DBT ) ద్వారా ఏటా రూ.54,000 కోట్లు ఖర్చుపెడుతున్నట్లు లెక్కలు చెబుతోంది.వైసీపీ ఐదేళ్ల పదవీ కాలం పూర్తియే నాటికి సరాసరి ప్రత్యక్ష నగదు బదిలీ పథకం కింద రూ.2,70,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నమని ప్రకటించారు.ప్రభుత్వం సంక్షేమానికి వేల కోట్లు ఖర్చు చేస్తుందని గొప్పలు చెబుతున్నప్పటికి అవి పూర్తిస్థాయిలో ప్రజలకు అందండం లేదని కాగ్ రిపోర్టు లెక్కలు స్పష్టంగా చెబుతున్నాయి.

ఇప్పటికే ప్రత్యక్ష నగదు బదిలీ నిర్వహణలో రాష్ట్రం దేశంలో 13వ స్థానంలో ఉంది.స్వయం సంవృద్ధిలో దేశంలోనే ఏపీ 19 వ స్థానంలో ఉంది.రోజు రోజుకు ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి.2019-20 వ ఆర్థిక సంవత్సరానికి రూ.48 వేల కోట్ల మేర నిధులు దుర్వినియోగం అయినట్లు కాగ్ తన నివేదికలో పేర్కొంది.2020-21 వ సంవత్సరానికి సంబంధించిన 1 లక్ష కోట్లకు లెక్కలు బయటకు చూపించలేదు.2021-22 వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.1,18,000 కోట్లకు లెక్కలు బహిర్గతం చేయలేదని కాగ్ తన రిపోర్టులో పేర్కొంది.ఈ విధంగా భారీగా అప్పులు చేసి వాటిని లెక్కలు చూపించకుండా ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు.

కార్పొరేషన్ ద్వారా వివిధ పథకాల పేర్లు చెప్పి వేల కోట్లు రుణాలు తీసుకుంటున్న ప్రభుత్వం వాటిని దారి మళ్లీంచి దోచుకుంటున్నారనే విషయం స్పష్టమౌతుంది.అప్పులు భారీగా చేయడం మూలంగా రెవెన్యూ వ్యయం భారీగా పెరిగిపోతుంది.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ లో నటిస్తున్నాడో తెలుసా..?

తీసుకున్న అప్పులకు రాబోయే రోజుల్లో కేవలం వడ్డీల రూపంలో రూ.లక్ష కోట్లు ఖర్చు చేయాల్సి రావడం బాధాకరం.తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టడానికి కొత్త అప్పులు చేయాల్సిన దుస్థితిలోకి రాష్ట్రాన్ని నెట్టారు.

Advertisement

రాజకీయ సలహాదారులకు లక్షల్లో జీతాలా? భుత్వ సలహాదారులకు లక్షల్లో జీతాలు ఖర్చు చేస్తున్నారు.ఏ అర్హత ఉండి వారికి అన్ని లక్షల్లో జీతాలు చెల్లిస్తున్నారు? రాజకీయ సలహాదారులకు ప్రజల డబ్బును జీతాలుగా చెల్లించే అర్హత లేదు.అధిక సంఖ్యలో తన పార్టీ అవసరాల కోసం జగన్ సలహాదారులను నియమించుకుని లక్షల్లో జీతాలు చెల్లిస్తున్నారు.

ఫలితంగా ఆ భారం రాష్ట్ర ఖాజానాపై పడుతుంది.బలహీనవర్గాలకు పెద్దఎత్తున కార్పొరేషన్లు కల్పించామని చెబుతున్న ప్రభుత్వం.

ఆయా కార్పొరేషన్ల ద్వారా ఎంత మందికి ఆర్థిక లబ్ధి చేకూర్చారో చెప్పాలి.కార్పొరేషన్ల ఛైర్మన్లు కూర్చోచడానికి కనీసం కూర్చీలు, సౌకర్యాలు కూడా లేవు.

స్వయం సహాయక సంఘాల ద్వారా కల్పించే రుణాలు రద్దు చేయడం జరిగింది.ఫలితంగా రాష్ట్రంలో పేదరికం పెరిగిపోతుంది.

వాలంటీర్లకు ప్రజాధనం ఏవిధంగా చెల్లిస్తారు.ప్రజల ధనంతో వాలంటీర్లను ప్రభుత్వం ఏవిధంగా నియమించింది? దాని వలన ప్రజలకు కలిగిన ప్రయోజనం ఏంటో ఎవరికి తెలియదు.వైసీపీ పార్టీకి తన సొంత అవసరాల కోసం ఉపయోగించుకునే వాలంటీర్లకు ప్రజాధనం ఏవిధంగా ఖర్చు చేస్తారు? ఇలా వాలంటీర్లకు ప్రజాధనం ఖర్చు చేయడం వలన ప్రభుత్వంపై అధికంగా రెవెన్యూ భారం పడుతోంది.రాష్ట్రంలో అభివృద్ధి అధ్వానంగా మారింది.

ఆర్.అండ్.బిలో గత సంవత్సరం రూ.190 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి.అంటే కనీసం రోడ్లపై గుంతులు కూడా పూడ్చలేని స్థితి.

రాష్ట్ర జీ.ఎస్.టీ.పీ గ్రోత్ నాలుగేళ్లలో -1.8 శాతం మాత్రమే.కానీ ప్రభుత్వం మాత్రం తాము ఏదో గొప్పలు సాధించినట్లు చెప్పుకుంటుంది.

కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేయడంతో పాటు పక్కదారి పట్టిస్తుంది.అయినా కేంద్ర ప్రభుత్వం, ఆర్.బీ.ఐ ఎందుకు స్పందించడం లేదు? రాష్ట్ర అర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బతిన్న ఈ సమయంలో కేంద్రం కలగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉంది.రాష్ట్రాన్ని ఆర్థికంగా సర్వనాశనం చేస్తున్న వైసీపీ ప్రభుత్వంపై ఆర్.

బీ.ఐ, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.

తాజా వార్తలు