పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది.2017- 18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ .47,725 కోట్లని తెలిపింది.2019లో జలశక్తి శాఖకు వచ్చిన సవరించిన వ్యయం రూ 55,548.87 కోట్లని.ఈ అంచనాలను జలశక్తి శాఖ అడ్వైజర్ కమిటీ అంగీకరించిందని వెల్లడించింది.రివైజ్డ్ కాస్ట్ కమిటీ సిఫార్సులతో అంచనా వ్యయం రూ.47,725 కోట్లని పేర్కొంది.రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తంలో ఇప్పటివరకు రూ.13,463.21 కోట్లు విడుదల చేశామని స్పష్టం చేసింది.రాజ్యసభలో టిడిపి ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది.
తాజా వార్తలు