జగన్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్.. భవిష్యత్తులో వీళ్లిద్దరి మధ్య పోటీ తప్పదా?

కొన్ని కాంబినేషన్లు సినీ ఇండస్ట్రీలో, పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ కావడం జరుగుతోంది.

ఇద్దరి మధ్య పోటాపోటీ పరిస్థితులు ఉంటే ఎవరు విజేతగా నిలుస్తారో ఊహించడం కూడా కొన్ని సందర్భాల్లో కష్టమవుతుంది.

ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో జగన్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య పోటీ తప్పదని కామెంట్లు వినిపిస్తున్నాయి.సరైన సమయం వస్తే టీడీపీలో తారక్ యాక్టివ్ అయ్యే ఛాన్స్ ఉందని పొలిటికల్ వర్గాల్లో టాక్ ఉంది.

జూనియర్ ఎన్టీఆర్ కు రాజకీయ అనుభవం లేకపోయినా రాజకీయాలపై పరిపూర్ణ అవగాహన మాత్రం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.తాత పోలికలతో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో తాతకు తగ్గ మనవడిగా ప్రూవ్ చేసుకోగా రాజకీయాల్లో కూడా సరైన సమయం వస్తే జూనియర్ ఎన్టీఆర్ ప్రూవ్ చేసుకోవడం గ్యారంటీ అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతానికి తారక్, జగన్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి.

Advertisement

తారక్ సన్నిహితులు కొందరు ప్రస్తుతం వైసీపీలో ఉండటంతో పాటు వైసీపీ అధినేత జగన్ ప్రశంసలు పొందారు.కొన్ని నెలల క్రితం తారక్ జగన్ ను కలవాల్సి ఉన్నా ఆ సమయంలో తారక్ తెలివిగా స్కిప్ చేశారు.ఆ సమయంలో తారక్ జగన్ తో వీడియో కాల్ మాట్లాడారని వార్తలు ప్రచారంలోకి వచ్చినా ఆ వార్తలు ఫేక్ అని తేలిపోయింది.

జూనియర్ ఎన్టీఆర్ 12 సంవత్సరాల క్రితం వైఎస్సార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

వైఎస్సార్ కూడా పలు సందబ్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ ను బుడ్డోడు అని కామెంట్ చేశారు.అయితే జగన్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న సందర్భాలు లేవు.అయితే రాబోయే రోజుల్లో వీళ్లిద్దరూ సీఎం అభ్యర్థులుగా పోటీ పడే అవకాశాలు ఉన్నాయి.

సొంతంగా పార్టీ ఉండటం, కార్యకర్తల్లో కూడా అభిమానం ఉండటం తారక్ జాతకంలో సీఎం అయ్యే యోగం ఉండటంతో తారక్ సీఎం కావాలని కోరుకునే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!
Advertisement

తాజా వార్తలు