బాలయ్య బాబు కి జగన్ మోహన్ రెడ్డి వీరాభిమాని అంట...

ఈ రోజు నందమూరి నటసింహం బాలయ్య బాబు 60వ పుట్టినరోజు కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా బాలయ్య బాబు కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కాగా తాజాగా కొంతమంది అభిమానులు అప్పట్లో బాలయ్య బాబుకు వీరాభిమాని అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

కాగా ఇటీవలే నందమూరి బాలకృష్ణ ఓ ప్రముఖ ఛానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.అయితే ఇందులో భాగంగా ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మీకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీకు ఒకప్పుడు వీరాభిమాని అంట కదా అని అడిగాడు.

దీంతో బాలయ్య బాబు అవునని సమాధానం చెప్పాడు.అయితే వైయస్ జగన్ తనకి వీరాభిమాని అని తెలుసు కానీ ఎప్పుడూ వ్యక్తి గతంగా జగన్ మోహన్ రెడ్డిని కలవలేదని చెప్పుకొచ్చాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మరియు బాలకృష్ణ అభిమానులు ఈ విషయాన్ని సోషల్ మీడియా మాధ్యమాలలో హైలెట్ చేస్తున్నారు.ఇందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా బాలయ్య బాబును ఉద్దేశించి రాజకీయ పరంగా గాని లేదా వ్యక్తిగతంగా గాని ఇప్పటివరకు ఎప్పుడూ విమర్శలు చేయలేదని చెబుతున్నారు.

Advertisement

అయితే గతంలో బాలకృష్ణ హీరోగా నటించినటువంటి చెన్నకేశవ రెడ్డి చిత్రం విడుదలైన సమయంలో కూడా శుభాకాంక్షలు తెలుపుతూ పెద్ద పెద్ద కటౌట్లు కూడా నిర్మించారని అంటున్నారు.కాగా బాలయ్య బాబు కి కోపం కాస్త ఎక్కువే అయినప్పటికీ ప్రేమ, కరుణ, జాలి, దయ కూడా ఎక్కువేనని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు