సీఎం జగన్, మంత్రులకు హైకోర్టు నోటీసులు

మూడు రాజధానుల కేసులో భాగంగా ఏపీ ప్రభుత్వానికి చిక్కెదురైంది.జగన్ తీసుకున్న రాజధాని మార్పుపై హైకోర్టు షాకిచ్చింది.

ఈ కేసు విచారణలో భాగంగా ఏపీ సీఎం జగన్ తో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.రాజధాని మార్పుపై కొందరు రైతులు దాఖలు చేసిన పిటిషన్ పై ధర్మాసనం విచారణ చేపట్టింది.

అన్ని పిటిషన్లపై ప్రభుత్వం కేవలం ఒక్క కౌంటర్ మాత్రమే దాఖలు చేయడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.ప్రతీ పిటిషన్ కూ ప్రత్యేకంగా కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది.

సీఎం జగన్ ప్రతిపక్షంలో ఓ మాదిరి, అధికారం వచ్చాక మరోలా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపించారు.వైకాపాతో పాటు ఇతర పార్టీలపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

ఈ కేసుపై సెప్టెంబర్ 21 వరకు స్టేటస్ కోను పొడగిస్తున్నట్లు తెలిపింది.అనంతరం విచారణ వేగంగా జరుగుతుందని వివరించింది.

ఈ కేసు విషయం ఫై తెదేపా, భాజపా నేతలకు నోటీసులు జారీ చేసింది.ఈ విచారణను ప్రత్యక్షంగా నిర్వహించాలా? వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించాలా? అన్న విషయంపై ధర్మాసనం ఇంకా స్పష్టతనివ్వలేదు.

Advertisement

తాజా వార్తలు