కన్న తల్లీదండ్రులకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన ఫైమా.. పేరెంట్స్ పై ప్రేమతో?

బిగ్ బాస్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న కంటెస్టెంట్లలో ఫైమా ఒకరు.

జబర్దస్త్ షో ద్వారా మొదట పాపులారిటీని సంపాదించుకున్న ఫైమా బిగ్ బాస్ షో ద్వారా ఆ పాపులారిటీని మరింత పెంచుకున్నారు.

పటాస్ షోలో ఛాన్స్ వచ్చే వరకు ఫైమా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.అద్దె ఇంట్లో జీవనం సాగించినా ఫైమా ఎన్నో కష్టాలను అనుభవించారు.

తన తల్లీదండ్రులకు ఇల్లు ఇవ్వాలని కంకణం కట్టుకున్న ఫైమా తన కష్టార్జితంతో ఇల్లు కొనుక్కున్నారు.ప్రస్తుతం ఈ ఇంటికి సంబంధించి ఇంటీరియర్ పనులు జరుగుతున్నాయి.

తన తల్లీదండ్రుల కోసం కారును కూడా కొనుగోలు చేస్తున్నానని ఫైమా చెప్పుకొచ్చారు.యూట్యూబ్ లో ఫైమా ఈ వీడియోను షేర్ చేయగా ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

Advertisement
Jabardasth Faima Bought Car Details Here Goes Viral In Social Media , Jabardasth

ఫైమా షేర్ చేసిన ఈ వీడియోకు దాదాపుగా రెండున్నర లక్షల వ్యూస్ వచ్చాయి.

Jabardasth Faima Bought Car Details Here Goes Viral In Social Media , Jabardasth

తన ఇంట్లో అబ్బాయిలు లేరని చుట్టుపక్కల వాళ్లు కారులో వెళుతుంటే ఆ సమయంలో పేరెంట్స్ కళ్లలో బాధను చూశానని ఫైమా అన్నారు.పేరెంట్స్ బాధను తగ్గించాలని మొదట వాళ్లను స్కూటీపై తిప్పానని ఫైమా చెప్పుకొచ్చారు.నా తల్లీదండ్రులను కారులో తిప్పాలని భావించానని ఆ కల ఇప్పటికి నిజమవుతుందని ఫైమా కామెంట్లు చేశారు.

ఫైమా చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Jabardasth Faima Bought Car Details Here Goes Viral In Social Media , Jabardasth

ఫైమాకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.ఫైమా కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.ఫైమాలాంటి కూతుళ్లు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

ఫైమాకు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.ఫైమా కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Advertisement

ఫైమా రెమ్యునరేషన్ సైతం అంతకంతకూ పెరుగుతోందని తెలుస్తోంది.

తాజా వార్తలు