ఇల్లు కొనుగోలు చేసేవారికి రూ 25 లక్షల ఉచిత సాయం... ఎక్కడంటే...

భారతదేశంలో ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటే పెరుగుతున్న ఆస్తుల రేటు గురించి తెలుసుకోవాలి.

ఏ నగరంలో లేదా గ్రామంలో మీరు భూమి కొనడానికి వెళితే, అక్కడి ధరలను తెలుసుకోవాలి.

అయితే దీనికి భిన్నంగా తమ ప్రాంతంలో సెటిల్ కావాలనుకునేవారికి అక్కడి అడ్మినిస్ట్రేషన్ ఇల్లు కొనుక్కోవడానికి దాదాపు 25 లక్షల రూపాయలు ఇస్తుంది.ఈ విషయన్ని ఎవరైనా ఒకపట్టాన నమ్మలేరు.

ఈ నగరం ఆగ్నేయ ఇటలీలో ఉంది, దీనిని ప్రెసిక్స్ అని పిలుస్తారు.ఇక్కడి పరిపాలనా విభాగం ఇక్కడ ఎవరైనా స్థరపడాలనుకుంటే, అందుకు అనువుగా ఇక్కడి ఖాళీ గృహాలను కొనుగోలు చేయడానికి దాదాపు 30 వేల యూరోలను ఉచితంగా ఇస్తుంది.

దీనిని భారత రూపాయిలలోకి మారిస్తే, 25 లక్షల రూపాయల కంటే అధికంగా ఉంటుంది.

Italy Are Getting 25 Lakh Rupees You Can Also Apply Like This , Councilor Alfred
Advertisement
Italy Are Getting 25 Lakh Rupees You Can Also Apply Like This , Councilor Alfred

దీనిని విని మీరు ఈ నగరంలో స్థిరపడాలనుకుంటే, ఈ విధంగా 25 లక్షల రూపాయలు తీసుకోవాలనుకుంటే, మీరు నగరానికి సంబంధించిన వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.మీడియా కథనాల ప్రకారం ఈ నగరంలో లెక్కకు మించి చాలా ఇళ్ళు ఖాళీగా ఉన్నాయని, నగరం ఎడారిగా మారిందని నగరానికి చెందిన కౌన్సిలర్ ఆల్ఫ్రెడో పల్లిస్ తెలిపారు.ఇటువంటి దుర్భర పరిస్థితిలో ఈ నగర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో తీసుకురావడానికి, ఇక్కడి ఇళ్ళు కొనుగోలు చేయడానికి ఆసక్తిపరులకు డబ్బు ఇవ్వాలని తాము ఒక ప్రణాళికను రూపొందించామని తెలిపారు.

ఇక్కడ ఉన్న గృహాల ఖరీదు 25 వేల యూరోలు, ఇవి దాదాపు 50 చదరపు మీటర్లలో నిర్మితమయ్యాయి.ఇటలీలో ఇది మొదటి ఉదంతం కాదు, ఖాళీగా ఉన్న నగరాలను జనాలతో నింపేందుకు ఇటువంటి ఆఫర్లు ఇస్తుంటారు.ఇంతకు ముందు కూడా ఇటలీలోని కాలాబ్రియా నగరంలో ప్రజలు స్థిరంగా ఉండేందుకు ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.24.76 లక్షలు ఇచ్చింది.ఇక్కడ స్థిరపడినవారు నూతన వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సహాయం అందిస్తుంటుంది.

Advertisement

తాజా వార్తలు