బండి సంజయ్ కు కేఏ పాల్ కు లింక్ పెట్టేసిన రేవంత్

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay ) ను టార్గెట్ చేసుకుని కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు.

బండి సంజయ్ నిరాశతోనే కాంగ్రెస్ పార్టీపై తరచుగా విమర్శలు చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు.

సంజయ్ మాటలకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మాటలకు సారూప్యత ఉంది అంటూ రేవంత్ సెటైర్లు వేశారు.తెలంగాణలో బీఆర్ఎస్( BRS ) కు వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో కాంగ్రెస్ ఉండడం, గత కొంతకాలంగా బిజెపి గ్రాఫ్ తగ్గి, కాంగ్రెస్ గ్రాఫ్ పెరగడం వంటి కారణాలతో కాంగ్రెస్ ను టార్గెట్ చేసుకుని బిజెపి నాయకులు విమర్శలు చేస్తున్న క్రమంలో, రేవంత్ సంజయ్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు.

ఈ సందర్భంగా తెలంగాణలో నవంబర్ చివరివారం లేదా డిసెంబర్ మొదటి వారంలో అసెంబ్లీ ఎన్నికలు( Assembly elections ) జరిగే అవకాశం ఉంది అంటూ రేవంత్ అన్నారు.

It Was Revanth Who Linked Bandi Sanjay To Ka Paul , Telangana, Bjp, Kcr, Brs Par

2023 డిసెంబర్ 9 లోగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని రేవంత్ జోష్యం చెప్పారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.దశాబ్ది ఉత్సవాల పేరుతో కెసిఆర్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, పోలీసులతో ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రశ్నించే వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ మండపడ్డారు.

Advertisement
It Was Revanth Who Linked Bandi Sanjay To KA Paul , Telangana, Bjp, Kcr, Brs Par

హజ్ యాత్రికులను కలవాలనుకున్న మాజీ మంత్రి షబ్బీర్ అలీని గృహనిర్బంధం చేశారని ఫైర్ అయ్యారు.తెలంగాణ అమరవీరుల పోరాటాల చరిత్రతో అమరవీరుల స్థూపం ఉండాలని, వారి త్యాగాల వల్లే ఇప్పుడు కేసీఆర్ అధికారాన్ని అనుభవిస్తున్నారని రేవంత్ అన్నారు.

It Was Revanth Who Linked Bandi Sanjay To Ka Paul , Telangana, Bjp, Kcr, Brs Par

తెలంగాణ అమరవీరులు 1200 మందని ప్రభుత్వం చెప్పలేదని మంత్రి ప్రశాంత్ రెడ్డి అంటున్నారని, తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన తొలి శాసనసభ స్పీచ్ లో కెసిఆర్ ఈ విషయం చెప్పలేదా అని రేవంత్ ప్రశ్నించారు.అలాగే శాసనసభలో అమరవీరులపై ఏకగ్రీవ తీర్మానం కూడా చేశారని రేవంత్ గుర్తు చేశారు.తెలంగాణ ఉద్యమ చరిత్రను అమరవీరుల త్యాగాలను అవమానించే విధంగా బీఆర్ఎస్ తీరు ఉంది అని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు