చంద్రయాన్-3 ల్యాండింగ్ తర్వాత డ్యాన్స్ చేసిన ఇస్రో ఛైర్మన్.. వీడియో వైరల్...

చంద్రుని దక్షిణ ధ్రువంపై భారత్‌ బుధవారం చంద్రయాన్‌ 3ని విజయవంతంగా ల్యాండ్‌ చేసిన సంగతి తెలిసిందే.

చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ అవతరించడంతో ఇది చారిత్రాత్మక విజయంగా మారింది.

ఈ విజయం తర్వాత ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్( S Somnath ), తన బృందంతో కలిసి డ్యాన్స్ చేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఈ చంద్రయాన్-3 లాంచ్‌కు ముందు గుళ్లు, గోపురాలకు తిరుగుతూ, అది సక్సెస్ కావాలని మొక్కిన శాస్త్రవేత్తలు నేడు ఇలా పాశ్చాత్య సంస్కృతిలో డ్యాన్స్ చేయడం ఒకింత షాక్ ఇచ్చిందని నెటిజన్లు కామెంట్ చేశారు.

కానీ ప్రతి భారతీయుడిని సగర్వంగా తలెత్తుకునేలా చేయడానికి వారు ఎంతో కృషి చేశారు.ఆ కృషి సఫలం కావడంతో వారి ఆనందానికి హద్దే లేకుండా పోయింది.

ఆ సంతోషంతో వీరు హాయిగా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా( Social media )లో వైరల్‌గా మారగా దానికి ఇప్పటికే కోట్లలో వ్యూస్ వచ్చాయి.

Isro Chairman Danced After Chandrayaan-3 Landing Video Viral , India, Chandrayaa
Advertisement
ISRO Chairman Danced After Chandrayaan-3 Landing Video Viral , India, Chandrayaa

ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు కూడా మిషన్ సక్సెస్ అయినందుకు ఎంతో సంతోషించి ఈ విజయాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇస్రో శాస్త్రవేత్తల కృషికి బాలీవుడ్ ప్రముఖులు షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ అభినందనలు తెలిపారు.చిరంజీవి, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, రామ్ చరణ్ తదితర టాలీవుడ్ హీరోలు కూడా కంగ్రాట్యులేషన్స్ చెప్పారు.

Isro Chairman Danced After Chandrayaan-3 Landing Video Viral , India, Chandrayaa

చంద్రయాన్ 3( Chandrayaan 3 ) విజయవంతంగా ల్యాండింగ్ కావడం భారతదేశ అంతరిక్ష కార్యక్రమానికి ప్రధాన మైలురాయి.ఇది చంద్రునిపై శాస్త్రీయ పరిశోధనలకు కొత్త అవకాశాలను తెరుస్తుంది.అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా ఇండియా ఈ ప్రయోగం చేయడం నిజంగా గొప్ప విషయం అని చెప్పవచ్చు.

Advertisement

తాజా వార్తలు