బ్రిటిష్ రెస్టారెంట్‌ స్టోర్లు ఇండియా అంతటా తీసుకొస్తున్న ఇషా అంబానీ.. ఆ వివరాలు ఇవే..

ముఖేష్ అంబానీ, అతని కుమార్తె ఇషా అంబానీకి( Isha Ambani ) చెందిన రిలయన్స్ బ్రాండ్స్ తాజాగా ప్రముఖ బ్రిటిష్ రెస్టారెంట్ చైన్ అయిన ప్రెట్ ఎ మాంగర్‌తో( Pret A Manger ) ఒప్పందం కుదుర్చుకున్నాయి.

తరువాత రిలయన్స్‌తో( Reliance ) ప్రత్యేక పార్ట్‌నర్‌షిప్ ద్వారా ఇండియాలో మొట్టమొదటి ప్రీట్ ఎ మాంగర్ స్టోర్‌ను కూడా లాంచ్ చేసాయి.

ఇషా అంబానీతో అనుబంధం ఉన్న రిలయన్స్ రిటైల్, రిలయన్స్ బ్రాండ్స్ ఈ సహకారాన్ని సులభతరం చేశాయి.ఢిల్లీ, బెంగళూరులలో రిచ్ ఏరియాలలో భారతదేశమంతటా మొత్తం 10 ప్రెట్ ఎ మాంగర్ రెస్టారెంట్‌లను ప్రారంభించాలనేది ఇషా అంబానీ ప్రణాళిక.

ఇండియాలో టీ, కాఫీ షాపులకు ప్రజలు పోటెత్తడం కామన్.ఈ డిమాండ్ ను బట్టి ప్రెట్ ఎ మ్యాంగర్‌ను భారతదేశానికి తీసుకురావాలనే ఇషా అంబానీ నిర్ణయించారు.

టాటా గ్రూప్‌లో భాగమైన స్టార్‌బక్స్ ఇండియాకు ఈ స్టోర్లు పోటీగా నిలవనున్నాయి.ప్రెట్ ఎ మ్యాంగర్‌లో అనేక రకాల కాఫీ, టీ వెరైటీలు దొరుకుతాయి

Advertisement

ముఖేష్, ఇషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ ఈ విదేశీ బ్రాండ్‌ను పరిచయం చేయడం ద్వారా భారతదేశంలోని ఆహార, పానీయాల పరిశ్రమలోకి ప్రవేశం చేస్తోంది.ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లో మొదటి ప్రీట్ ఎ మాంగర్ స్టోర్ ఇప్పటికే తీసుకొచ్చింది.రిలయన్స్ బ్రాండ్స్ మేనేజింగ్ డైరెక్టర్, దర్శన్ మెహతా మాట్లాడుతూ, ఈ భాగస్వామ్యం తాజా పదార్థాలు,

టేస్టీ వంటకాలు, నాణ్యమైన ఆహారం, గుర్తించదగిన కాఫీ గింజలతో బెస్ట్ డ్రింక్స్ భారతీయులకు అందించడం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు.ప్రెట్ ఎ మ్యాంగర్‌ను భారతదేశానికి తీసుకురావడంతో పాటు, ముఖేష్, ఇషా అంబానీలు భారతదేశంలో గతంలో బ్యాన్ అయిన ప్రముఖ చైనీస్ దుస్తుల అప్లికేషన్ షీన్‌ను తిరిగి తీసుకురావాలని కూడా యోచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు