జూనియర్ ఎన్టీఆర్ జాతకంలో అలాంటి దోషమా.. చేయకపోతే కెరీర్ పరంగా నష్టం తప్పదా?

జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా ద్వారా మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.2018లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత సినిమా తర్వాత గత నాలుగు సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ ఎలాంటి సినిమాలలో నటించలేదు.

అయితే RRR సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్ ఈ సినిమా సక్సెస్ అవడంతో హనుమాన్ దీక్ష తీసుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ ఈ విధంగా ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష తీసుకోవడానికి కారణం ఏంటి అంటే ఆరా తీశారు.ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ అయ్యప్ప దీక్ష తీసుకున్న తరువాత అదే బాటలోనే ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష తీసుకోవడం గమనార్హం.

తాజాగా ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష తీసుకోవడం వెనక ఓ కారణం ఉంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.కేవలం దోష నివారణ కోసమే ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష తీసుకున్నారని పెద్ద ఎత్తున వార్తలు వినపడుతున్నాయి.

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తే ఆ హీరో తదుపరి చిత్రం ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో కొనసాగుతోంది.

Advertisement

ఈ క్రమంలోనే RRR సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం కూడా విజయవంతం కావాలని, ఈ సెంటిమెంట్ అనే దోషం నుంచి తప్పించుకోవడం కోసమే హనుమాన్ దీక్ష తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఈ విధంగా ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష తీసుకొని తన జాతకంలో వున్న దోషాలు కూడా తొలగిపోవడం కోసం త్వరలోనే హోమం చేయబోతున్నారు అంటూ ఆయన సన్నిహితులు వెల్లడిస్తున్నారు.ఇక ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష పూర్తి అయిన తర్వాత వెంటనే కొరటాల శివ సినిమాతో బిజీకానున్నారు.

కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?
Advertisement

తాజా వార్తలు