ఈ మాత్రం సీట్లకు పోటీ ఎందుకు జనసేనాని ?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో( Telangana assembly election ) 32 స్థానాల్లో పోటీ చేస్తామంటూ ఆర్పాటంగా ప్రకటించిన జనసేన చివరి నిమిషంలో బజాపా ఎంటర్ అవ్వడంతో తమ వ్యూహం మార్చుకుంది .

ఇప్పుడు కేవలం 9 స్థానాలలో మాత్రమే జనసేన అభ్యర్థులు పోటీ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.

అయితే 119 అసెంబ్లీ స్థానాలు ఉన్న తెలంగాణలో కేవలం 9 సీట్లకు జనసేన సర్దుకుపోవటం, ఆ పార్టీపై నెగిటివ్ ఒపీనియన్ వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Is Pawan Kalyan Compamised In Telangana Contest, Janasena , Pawan Kalyan , Te

ముఖ్యంగా జనసేన కీలక ప్రభావం చూపిస్తుంది అన్న అంచనాలు ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లో ఈ సీట్ల సర్దుబాటు ఘణనీయమైన ప్రభావం చూపించే అవకాశం ఉందని ఇక్కడ 9 సీట్ల కి ఒప్పుకున్నారు కాబట్టి అక్కడ ఏ 20-25 సీట్లకొ జనసేన ( Janasena )ను ఒప్పించే విధంగా తెలుగుదేశం ఒత్తిడి( TDP ) తీసుకురావచ్చని విశ్లేషణలు వస్తున్నాయి .అయినా పార్టీ ప్రభావం పెద్దగా లేని చోట్ల అనవసర పోటీకి దిగుతున్న జనసేన కనీసం సీట్ల సంఖ్య అయినా గౌరవప్రదంగా తెచ్చుకుని ఉండుంటే తర్వాతి పొత్తు చర్చలలో అది ఉపయోగపడి ఉండేదని, ఇప్పుడు వ్రతమూ చెడింది ఫలితం కూడా దక్కలేదన్నట్లుగా జనసేన పరిస్థితి తయారయిందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.ఆ మాత్రం సీట్లకు పొత్తులు అంటూ ఘనంగా ప్రకటించడం దేనికంటూ కూడా కొంతమంది పెదవి విరుస్తున్నారు.

Is Pawan Kalyan Compamised In Telangana Contest, Janasena , Pawan Kalyan , Te

జనసేన హార్డ్ కోర్ అభిమానులకు కూడా ఈ సీట్ల సంఖ్య ఏ మాత్రం సంతృప్తి ఇవ్వలేదని వారి సోషల్ మీడియా పోస్టింగులను చూస్తే అర్థమవుతుంది .మరి పార్టీ పెట్టిన తర్వాత మొదటి పొత్తు చర్చలలో జనసేన విఫలమైనట్లుగానే భావించాల్సి ఉంటుందంటున్నారు.అయితే మొదటి అడుగు ఎప్పుడూ ఒకటే ఉంటుందని , తెలంగాణ అసెంబ్లీలో తమ ప్రాతినిధ్యం ఉండాలన్న బలమైన సంకల్పంతోనే జనసేనాని ఈ సీట్లకు ఒప్పుకున్నారని, ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి తెలంగాణ రాజకీయానికి సంబంధం లేదని ఇక్కడ తగ్గామంటే అర్దం ప్రతిచోట తగ్గుతామని కాదంటూ కూడా జనసేన వర్గాలు వ్యాఖ్యానిస్తున్నట్లుగా తెలుస్తుంది.

Advertisement
Is Pawan Kalyan Compamised In Telangana Contest, Janasena , Pawan Kalyan , Te

ఏది ఏమైనా తన పైన ఉన్న అంచనాలు అందుకోవడం లో మాత్రం పవన్ విఫలమయ్యారనే మెజారిటీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు .

భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?
Advertisement

తాజా వార్తలు