జ‌న‌సేన ప్లాన్ చేంజ్..! పొత్తులు ప‌క్క‌న పెట్టి డైరెక్ట్ గా బ‌రిలోకి..!!

జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మూడు ఆప్ష‌న్లు ఉన్నాయ‌ని మొన్న‌టి వ‌ర‌కు చెప్పినా తాజాగా మ‌రో ప్లాన్ తో వ్యూహ ర‌చ‌న చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఇక ప‌దేప‌దే పొత్తులపై చేసిన కామెంట్స్, పార్టీ ఆఫీస్ లో జ‌రిగిన చ‌ర్చ‌లు ఇవ‌న్నీ ప‌క్క‌న పెట్టేసిన‌ట్లు తెలుస్తోంది.

పొత్తుల విష‌యం ప‌క్క‌కు పెట్టి ప్ర‌త్యేక వ్యూహంతో ఒంటరిగానే రంగంలోకి దిగ‌డానికి రెడీ అవ‌తున్న‌ట్లు తెలుస్తోంది.ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నా పెద్ద‌గా క‌లిసి వ‌చ్చేది ఏమీ లేద‌ని.

ఇప్ప‌టికే కేంద్రాన్ని ఏపీ ప్ర‌జ‌లు న‌మ్మ‌డంలేద‌నే వాస్త‌వంతో డైరెక్ట్ గా బ‌రిలోకి దూకుతున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.కౌలు రైతు భరోసా యాత్ర పేరిట పలు జిల్లాల్లో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్న విష‌యం తెలిసిందే.

కాగా కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందజేస్తున్నారు.ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న పవన్ తాజాగా పొత్తుల‌పై క్లారిటీ ఇచ్చిన‌ట్లు అనిపిస్తోంది.

Advertisement

పొత్తులు నాకు జనంతోనే అని పవన్ పక్కా క్లారిటీతోనే అన్నారు.మేము ప్రజల కోసమే ఉంటాం.

వారికే బాధ్యులమ‌ని కూడా ఆయన గట్టిగానే చెప్పుకున్నారు.ప్రజల కోస‌మే జనసేన పుట్టింద‌ని కూడా అన్నారు.

జనసేనకు అవినీతి, అక్రమాలు చేసే పరిస్థితి లేద‌ని నిజాయితీగా ఉంటుంద‌ని అన్నారు.ఓడిపోయినా కూడా ప్ర‌జ‌ల్లోనే ఉన్న‌మ‌ని గుర్తుచేశారు.

ప్రతికూల పరిస్థితులలో కూడా గట్టిగా నిలబడగలితే దమ్మూ ధైర్యం జ‌న‌సేన పార్టీది అని చెప్పారు.2014లోనే పోటీ చేసి పవర్ లోకి వ‌చ్చి ఉంటే ఏపీకి ఇన్ని కష్టాలు ఉండేవి కావ‌ని ప్ర‌సంగించారు.జనసేన వైపు చూడండి.

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసీ హెచ్చరిక..!!
10 గంటల పాటు డంప్ యార్డ్ లో ధనుష్.. ఈ నటుడి కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!

ఇంతకాలం అందరికీ అవకాశాలు ఇచ్చారు.ఇపుడు మాకు ఇవ్వండి అని ఓపెన్ గానే అడిగేశారు.

Advertisement

అన్ని ఆలోచించుకునే త‌మ‌కు మద్దతు ఇవ్వాల‌ని పాలించగలమని హామీ ఇస్తున్నామ‌ని కాస్తా గ‌ట్టిగానే చెప్పారు.

అలాగే 2014 త‌ర్వాత‌ ప్రజల కోస‌మే బాబుని నిల‌దీశామని, బీజేపీని ప్రత్యేక హొదా విషయంలో గట్టిగా అడిగామని గుర్తుచేశారు.అయితే ఈ రెండు పార్టీల‌ను కూడా తాను వ్య‌తిరేకించాన‌ని మ‌రోసారి చెప్ప‌క‌నే చెప్పారు.వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌ను న‌మ్మి ఒక్క చాన్స్ ఇస్తే బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కూడా పవన్ చెప్పారు.

మొత్తానికి ప‌వ‌న్ పొత్తుల‌పై క్లారిటీ ఇచ్చిన‌ట్టుగానే క‌న‌బ‌డుతోంది.అయితే మరి ప‌వ‌న్ కి ఒక్క చాన్స్ ఇస్తారా.

వైసీపీకే జై కొడ‌తారా.లేక బాబుని నాలుగో సారి సీఎం సీట్లు కూర్చోబెడ‌తారో చూడాలి.

మొత్తానికి ప‌వ‌న్ చెప్పాల్సింది చెప్పేసిన‌ట్లు అనిపించింది.

తాజా వార్తలు