మూడో పెళ్లికి సిద్దమైన స్టార్ హీరో.. ఎవరంటే?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒకరితో రిలేషన్ షిప్ మెయింటైన్ చేస్తూ మరొకరిని పెళ్లి చేసుకోవడం లేదా తన భార్యకు విడాకులు ఇచ్చి మరొకరిని పెళ్లి చేసుకోవడం వంటివి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి.

అయితే ఇలాంటి కల్చర్ ఎక్కువగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉంది.

బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఇప్పటికే ఇద్దరిని పెళ్లి చేసుకుని తన రెండవ భార్యకు కూడా విడాకులు ఇచ్చి మూడో పెళ్ళికి సిద్ధమయ్యాడు మరొక స్టార్ హీరో.అతను మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్.

అమీర్ ఖాన్ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు తాజాగా తన రెండో భార్య కిరణ్ రావుకు అమీర్ ఖాన్ విడాకులు ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే తన రెండవ భార్యకు విడాకులు ఇచ్చిన అమీర్ ఖాన్ ముచ్చటగా మూడోసారి పెళ్లికి సిద్ధమయ్యారు.

అమీర్ ఖాన్ దంగల్ సినిమా షూటింగ్ సమయంలో ఫాతిమా సనా షేక్‌ తోసన్నిహితంగా మెలగడం వల్ల వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని త్వరలోనే వీరి పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

ఈ క్రమంలోనే తన గురించి వస్తున్న వార్తలపై ఫాతిమా స్పందిస్తూ కొందరు కావాలనే అమీర్ ఖాన్, తనపై ఈ విధమైనటువంటి పుకార్లు సృష్టిస్తున్నారని ఆమె వెల్లడించారు.తన గురించి అమీర్ ఖాన్ గురించి వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ఈమె తెలిపారు.అమీర్ ఖాన్ మొదటి భార్య రీనాదత్తాకు 2002లో విడాకులిచ్చి అనంతరం కిరణ్ రావును 2005లో పెళ్లి చేసుకున్నారు.

ఈ దంపతులకు ఆజాద్‌ రావ్‌ ఖాన్ అనే కొడుకు కూడా ఉన్నారు.అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.ప్రస్తుతం అమీర్ ఖాన్ పలు సినిమాలతో బిజీగా ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే కొందరి గిట్టనివారు ఇలా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలుస్తోంది.ఇక ఈయన నటించిన లాల్ సింగ్ చద్దా విడుదలకు సిద్ధంగా ఉంది.

లక్కీ భాస్కర్ : భిన్నమైన కథే కానీ, అందరి బుర్రకెక్కుతుందో లేదో చూడాలి!
Advertisement

తాజా వార్తలు