మహేష్ బాబుపై కోర్టులో కేసు

శ్రీమంతుడు కథ కాపి వివాదం మళ్ళీ వెలుగులోకి వచ్చింది.

మీకు గుర్తు ఉండే ఉంటుంది, సినిమా విడుదలైన కొన్నిరోజులకు శరత్ చంద్ర అనే రచయిత శ్రీమంతుడు కథని 2012 లో పబ్లిష్ అయిన తన నవల "చచ్చేంత ప్రేమ" నుంచి కాపి కొట్టారని అరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

కొరటాల ఈ ఆరోపణలని అప్పట్లో ఖండించిన, మహేష్ మాత్రం స్పందించలేదు.ఇన్నిరోజుల తరువాత ఆ రచయిత కోర్టుకెక్కాడు.

IPC 120B మరియు కాపిరైట్ చట్టం సెక్షన్ 63 కింద శ్రీమంతుడు కథానాయకుడు మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ, నిర్మాత నవీన్ యర్నేనిల మీద కేసు నమోదయ్యింది.నాంపల్లి కోర్టు వీరి ముగ్గరికి సమన్లు జారిచేసింది.

అలాగే ఈ చిత్రం యొక్క రిమేక్ హక్కులు ఇతర భాషలవారికి ఇవ్వకుండా అడ్డుకోవాలని కూడా ఆ రచయిత కోర్టుని అభ్యర్థించాడని తెలుస్తోంది.ఇప్పుటివరకైతే ఈ కేసు మీద శ్రీమంతుడు టీమ్ స్పందించలేదు.

Advertisement
ఓకే టైటిల్ తో అక్కినేని, ఎన్టీఆర్, చిరంజీవి సినిమాలు.. ఏది హిట్ ? ఏది ఫట్ ?

తాజా వార్తలు