రుషికొండ తవ్వకాలపై ఏపీ హైకోర్టులో విచారణ

విశాఖ రుషికొండ తవ్వకాలపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.అభివృద్ధి పేరుతో కొండలను తవ్వేస్తున్నారని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ క్రమంలో తవ్వకాలపై కేంద్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు చేయమని పంపుతామని వెల్లడించింది.ఈ మేరకు కమిటీ వేస్తే అభ్యంతరం ఎందుకు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.9.88 ఎకరాలకు అనుమతి ఇస్తే 20 ఎకరాల్లో తవ్వకాలు చేశారని పిటిషనర్ తెలిపారు.అయితే 9.88 ఎకరాలకే పరిమితమయ్యామని ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు.దీనిపై గూగుల్ మ్యాప్ లు అబద్ధాలు చెబుతాయా అని న్యాయమూర్తి ప్రశ్నించారు.

అయితే అఫిడవిట్ దాఖలు చేసేందుకు ప్రభుత్వ న్యాయవాది సమయం కోరారు.ఈ క్రమంలో అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత వాస్తవాలు తేలుస్తామని ధర్మాసనం పేర్కొంది.

అనంతరం తదుపరి విచారణను నవంబర్ 3కు వాయిదా వేసింది.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు