ఆసక్తికరంగా ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ రాజకీయాలు

ఖమ్మం జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.సత్తుపల్లిలో రాజ్యసభ సభ్యులు రవిచంద్ర, పార్థసారథి రెడ్డిలకు సన్మాన కార్యక్రమం జరిగింది.

అయితే ఈ అభినందన సభకు ఆ పార్టీ నేత, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆహ్వానం అందలేదని సమాచారం.జిల్లా ఇంఛార్జ్, స్థానిక ఎమ్మెల్యేల నుంచి ఎటువంటి పిలుపు రాకపోవడంతో తుమ్మల అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవలే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ ర్యాలీతో తుమ్మల బలప్రదర్శన చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో కేసీఆర్ తోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు.

అయితే ఎంపీ సన్మానానికి తుమ్మలను పిలకపోవడంతో జిల్లా రాజకీయాలతో పాటు పార్టీ వర్గాలో చర్చనీయాంశంగా మారింది.

Advertisement
ఆ విషయంలో ఫహాధ్ ఫాజిల్,రాజ్ కుమార్ రావ్ ఫాలో అవుతున్న రాగ్ మయూర్?

తాజా వార్తలు