నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ కు చేరుకున్న ఇంటర్ ప్రశ్నాపత్రాలు

సూర్యాపేట జిల్లా: ఈనెల 28 నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్న ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల నేపథ్యంలో శనివారం కట్టుదిట్టమైన భద్రతా నడుమ నల్లగొండ నుండి నేరుగా సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాయి.

ఈ సందర్భంగా నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల,డిఇసి మెంబర్ లక్ష్మయ్య మండలానికి సంబంధించి ప్యాక్ చేసిన ప్రశ్నపత్రాలను పరిశీలించి, పోలీసుల ఆధ్వర్యంలో ప్రశ్న పత్రాలను ట్రంక్ పెట్టెలలో పోలీస్ స్టేషన్ లాకర్లలో భద్రపరిచారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 28 నుండి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్ష ప్రశ్న పత్రాలను జాగ్రత్తగా భద్రపరిచామన్నారు.ప్రభుత్వ ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన భద్రతతో ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో చీప్ సూపర్ండెంట్ మాధవి, డిపార్ట్మెంట్ ఆఫీసర్ వీరయ్య,సూర్యాపేట జిల్లా జూనియర్ కాలేజ్ లెక్చరర్, రూట్ ఆఫీసర్ డా.సతీష్, ఉపేందర్,శ్రీను పోలీసులు పాల్గొన్నారు.

అనంతగిరి మండలంలో అంగన్వాడీ ఆయాల కొరత...!
Advertisement

Latest Suryapet News