కెనడా : చిరకాల మిత్రుడిని పెళ్లాడిన భారత సంతతి ఎంపీ కమల్ ఖేరా ..!!

భారత సంతతికి చెందిన కెనడా ఎంపీ, మంత్రి కమల్ ఖేరా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.తన చిరకాల మిత్రుడు జస్‌ప్రీత్ ధిల్లాన్‌ను ఆమె వివాహం చేసుకున్నారు.

ఈ వివాహానికి భారత సంతతికి చెందిన కెనడా ఎంపీలు సుఖ్ ధాలివాల్, డాక్టర్ కుల్జిత్ సింగ్ జంజువా, మహీందర్ పాల్ సింగ్, హర్దమ్ మంగత్, దీప్ కరణ్ జస్‌ప్రీత్‌లు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.ప్రస్తుతం బ్రాంప్టన్ వెస్ట్ నుంచి కమల్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

ఆమె తొలిసారిగా 2015లో బ్రాంప్టన్ వెస్ట్ పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు.గతంలో అంతర్జాతీయ అభివృద్ధి మంత్రికి , జాతీయ రెవెన్యూ మంత్రికి , ఆరోగ్య మంత్రికి పార్లమెంటరీ కార్యదర్శిగా పనిచేశారు.

పార్లమెంట్‌కు ఎన్నికైన అతి పిన్న వయస్కులలో ఖేరా కూడా ఒకరు.ఆమె ఒక రిజిస్టర్డ్ నర్స్, కమ్యూనిటీ వాలంటీర్, రాజకీయ కార్యకర్తగానూ ప్రజా జీవితంలో వున్నారు.

Advertisement

రాజకీయాల్లోకి రాకముందు.ఖేరా టొరంటోలోని సెయింట్ జోసెఫ్స్ హెల్త్ సెంటర్ లో ఆంకాలజీ యూనిట్ లో రిజిస్టర్డ్ నర్సుగా పనిచేశారు.అక్కడ ప్రతిరోజూ ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సుపై ప్రభావం చూపే సమస్యలపై కమల్ ఖేరాకు లోతైన అవగాహన వుంది.1989 ఫిబ్రవరి 4న న్యూఢిల్లీలో జన్మించిన కమల్ ఖేరా.యార్క్ యూనివర్సిటీలో నర్సింగ్ లో హానర్స్ బ్యాచిలర్స్ ఆఫ్ సైన్స్ డిగ్రీ చేశారు.

కమల్ ఖేరా డిసెంబర్ 2014లో బ్రాంప్టన్ వెస్ట్ లో లిబరల్ పార్టీ అభ్యర్ధిగా నామినేట్ అయ్యారు.ఆ తర్వాతి సంవత్సరం అక్టోబర్ లో జరిగిన ఫెడరల్ ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు.2015లో కమల్ తొలిసారిగా ఎన్నికైనప్పుడు, కెనడా పార్లమెంట్ లో అడుగుపెట్టిన అతి పిన్న వయస్కురాలైన లిబరల్ ఎంపీగా కమల్ ఖేరా రికార్డుల్లోకెక్కారు.2019, 2021 ఎన్నికల్లో వరుసగా గెలిచిన ఆమె.అక్టోబర్ 26, 2021న పవన్ ఖేరా జస్టిన్ ట్రూడో కేబినెట్ లో సీనియర్ మంత్రిగా పదోన్నతి పొందారు.

Advertisement

తాజా వార్తలు