ఘర్షణకు దిగడమే కాకుండా ఆపై హత్యకు పాల్పడిన భారత సంతతి వ్యక్తిని సింగపూర్ పోలీసులు( Singapore Police ) అరెస్ట్ చేశారు.
ఆరుగురు వ్యక్తులు మారణాయుధాలతో అల్లర్లకు పాల్పడినట్లుగా ఛానల్ న్యూస్ ఏషియా నివేదించింది.
కాంకోర్డ్ హోటల్ అండ్ షాపింగ్ మాల్‌లో( Concorde Hotel and Shopping Mall ) ఆదివారం జరిగిన ఘర్షణలో మహ్మద్ ఇస్రత్ మొహమ్మద్ ఇస్మాయిల్‌ను( Mohammad Isrrat Mohd Ismail ) హత్య చేసినట్లుగా 29 ఏళ్ల అశ్వయిన్ పచాన్ పిళ్లై సుకుమారన్‌పై ఆరోపణలు వున్నాయని ది స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదించింది.అరెస్ట్ తర్వాత అశ్వయిన్‌ను ( Asvain Pachan Pillai Sukumaran ) వీడియో లింక్ ద్వారా మంగళవారం కోర్టు ఎదుట హాజరుపరిచారు పోలీసులు.
హత్యా నేరం రుజువైతే అతనికి న్యాయస్థానం మరణశిక్ష( Death Sentence ) విధించే అవకాశం వుంది.మారణాయుధాలతో అల్లర్లకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న ఆరుగురు వ్యక్తులకు నేరం రుజువైతే.
ఒక్కొక్కరికి పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశాలు వున్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు.ఏడవ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ప్రమాదకరమైన ఆయుధంతో గాయపరిచినట్లు దోషిగా తేలితే అతనికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు.
కాగా.కొద్దిరోజుల క్రితం సింగపూర్‌లో భారత సంతతికి చెందిన ఎగ్జిక్యూటివ్‌పై లంచం ఆరోపణలు రావడంతో అతనిపై అభియోగాలు నమోదు చేశారు.ఒక ఇంజనీరింగ్ కంపెనీలో పనిచేస్తున్న అతను దాదాపు 1,50,000 సింగపూర్ డాలర్ల మేర లంచాలు( Bribe ) తీసుకున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి.
నిందితుడిని బాలకృష్ణన్ గోవింద సామి (61)గా( Balakrishnan Govinda Swamy ) గుర్తించారు.ఈ మేరకు గత బుధవారం కోర్టులో ఆయనపై అభియోగాలు మోపారు.ఇతనితో పాటు తొమ్మిది మంది కాంట్రాక్టర్లకు కూడా ఈ కేసులో ప్రమేయం వుందని ప్రాసిక్యూటర్లు తెలిపారు.
గోవిందసామి 2015 నుంచి 2021 మధ్య కనీసం 2,02,877 సింగపూర్ డాలర్ల మేరకు నగదు రూపంలో అవినీతికి పాల్పడ్డారని కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (సీపీఐబీ) తెలిపింది.
సెంబ్‌కార్ప్ మెరైన్ ఇంటిగ్రేటెడ్ యార్డ్‌తో 9 మంది కాంట్రాక్టర్ల వ్యాపార ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడానికి గోవిందసామి ఈ మొత్తాన్ని డిమాండ్ చేసినట్లుగా సీపీఐబీని ఉటంకిస్తూ ఛానల్ న్యూస్ ఏషియా శుక్రవారం నివేదించింది.ఈ నేరాలకు గాను గోవింద సామి అవినీతి నిరోధక చట్టం కింద శిక్షార్హమైన 14 అభియోగాలను ఎదుర్కొన్నాడు.వీటిలో ఐదు అభియోగాలు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం శిక్షార్హమైనవి.
చట్టం ప్రకారం అవినీతి నేరానికి పాల్పడిన వ్యక్తికి 1,00,000 సింగపూర్ డాలర్ల వరకు జరిమానా, ఐదేళ్ల వరకు జైలు శిక్ష, లేదా రెండూ విధించబడతాయి.దీనికి అదనంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం దోషిగా తేలితే ఆ నేరానికి రెండు రెట్లు అధికంగా శిక్షను అనుభవించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy